కాశీ విశ్వేశ్వరుడు: సర్వ పాపములను హరించును.ప్రళయ కాలములో కూడా నాశనం చెందదు.
త్రిలోచనేశ్వరుడు: కోటి కల్పములు కదలిననుపునర్జన్మ ఉండదు.
సముద్రేశ్వరుడు: అవశ్యం మోక్షం ప్రసాదించును.
కామేశ్వరుదు: మనోబలం వృద్ధి చేసి కోరిన కోర్కెలు తీర్చును.
కుబేరేశ్వరుడు: కోటి దానములు చేసిన పుణ్యం కలుగును.
అవిముక్తేశ్వరరుడు: సర్వ బంధముల నుండి విముక్తులగుదురు. వీరిని యమ ధర్మరాజు చూసిన దూరమునుండియే నమస్కరించును.
విశ్వకర్మేశ్వరుడు:
సద్భుద్ది మొక్షము కలిగించును.
దధీశ్వరుడు: నామస్మరణ మరియు దర్శనం చేతనే దరిద్ర విముక్తులు అగుదురు.
మహాకాళేశ్వరుడు: చరాచర జగత్తును పూజించిన ఫలం కలుగును. కలి భయం తొలగును. ఫాపములు నశించి
మోక్షము పొందెదరు.
వైకుంఠేశ్వరుడు: యమయాతనలు అనుభవించరు
అవిముక్తేశ్వరుడు: కాశీయొక్క అధిష్టాన దేవత. ముక్తి కొరకు సేవించాలి.
చక్రేశ్వరుడు: గహనమగు సంసార చక్రమున ప్రవేసింపరు.
అత్రీశ్వరుడు: విష్ణులోక ప్రాప్తి కలుగును.
గభ స్త్రీశ్వరుడు: శివుడు మరియు మంగళ గౌరిలకు ప్రదక్షిణ చేసినచో భూ ప్రదక్షిణ ఫలము కలుగును
రామేశ్వరుడు: బ్రహ్మ హత్యా పాతకము తొలగించును.
వైద్యనాధేశ్వరుడు: వంశవృద్ధి.
దశాస్వమేధేశ్వరుడు: దశాశ్వమేధ యాగ ఫలం సిద్ధింప చేయును.
కేదారేశ్వరుడు: రుద్రుని అనుచరులగుదురు.
కోటీశ్వరుడు: కోటి దాన పుణ్యము కలుగును.
వృద్ధ కాళేశ్వరుడు: జన్మ బంధముల నుండి విముక్తులగుదురు.
మృత్యుంజయ లింగం: అపరాధ సహస్రములు నసించును.
ధర్మేశ్వరుడు: తాకినా పూజించినా చూసినా కొద్ది కాలంలోఎనే సిద్ధి పొందెదరు. అక్షయ ఫలములు కలుగును.
త్రితాపేశ్వరుడు: అత్యధిక ఫలములు పొందెదరు.
విశాలాక్షీశ్వరుడు: సర్వ శుభములను ప్రసాదించును. స్త్రీ పురుషులకు వాంచితములు సిద్ధించును.
లోలార్కేశ్వరుడు: ఆరాధించిన వారికి అనంత ఫలములు కలుగును. ఇచట చేసిన దానము స్వల్పమైనను దాని ఫలము అనంతము.
ధన్వంతేశ్వరుడు: దేవతల వైద్యుడైన ధన్వంతరి మహా ఔషధములను ఈ కుండములో నిక్షిప్త పరచెను.
ఈలింగ దర్శనము అత్యంత ఆరోగ్యకరము. దారుణ వ్యాధుల బారినుండి భక్తులు రక్షింపబడుదురు.
"అకార" "ఉకార" "మకార"-"ఓంకారేశ్వరుడు: కోటి జన్మలు గడచినను పునర్ఝన్మ ఉండదు.ఓం కారేశ్వరుని ఎచట దర్శించినా భూమియందలి సర్వ లింగములు దర్శించినట్లే.
దండ పాణేశ్వరుడు: శివధూర్తులైన లింగ దుష్టులను దండించి భక్తులను కాపాడును.
మయూఖేశ్వరుడు: జన్మ రహితులగుదురు. పుత్ర పౌత్రాది బహు సంపదలు పొంది అనంతరము మోక్షము పొందెదరు.
నందీశ్వరుడు: ఆయా గణముల లోకములో నివసింతురు.
సిద్ధేశ్వరుడు: సర్వసిద్ధిప్రదము.
వ్యాఘ్రేశ్వరుడు: వ్యాఘ్ర చోర భయము ఉండదు.
భార భూతేశ్వరుడు: పాప భారము హరించును.
పితృలింగాలు: పితామహులు ప్రపితామహులు సంతసింతురు.
చండీశ్వరుడు: పాపములను శమింపచేయును.
శతకాల లింగేశ్వరుడు: శతాయుష్కులు అగుదురు.
అవధూతేశ్వరుడు: పశు పాశములనుండి విముక్తి చేయును.
రావణేశ్వరుడు: రాక్షస భయము ఉండదు.
గ్రహేశ్వరుడు: గ్రహ బాధలు నశింపచేయును.
వరుణేశ్వరుడు-బాణేశ్వరుడు-గంగేశ్వరుడు-కాలకేశ్వరుడు: పాపరహితము చేయుదురు.
కపిలేశ్వరుడు: ఈ శరీరముతోనే పరమ సిద్ధి పొందెదరు.
శుక్రేశ్వరుడు: పుత్ర పౌత్ర వృద్ధి కలుగును
.
గోకర్ణేశ్వరుడు: పాపనాశనము చేయును.
భగీరధేశ్వరుడు- దిలీపేశ్వరుడు: ఇష్టములను సిద్ధింప చేయుదురు.
రుద్రేశ్వరుడు: రుద్ర లోక ప్రాప్తిని కలిగించును.
కర్కోటకేశ్వరుడు: నాగాధి పధము పొందెదరు.
భైరవేశ్వరుడు: స్పర్స మాత్రముననే సర్వ యజ్ఞఫలములు లభించును.
జంబుకేశ్వరుడు: పశు పక్ష్యాది జన్మలనుంచి హరించును.
బ్రహ్మ రాతేశ్వరుడు:
అకాల మృతిని పొందరు.
ధర్మేశ్వరుడు:
తాకినా,చూసినా, పూజించినా కొద్ది కాలములోనే సిద్ధి పొందెదరు.
రక్షేశ్వరుడు: వేయి అపరాధములు శివునిచే క్షమించబడును.
శనీశ్వరుడు: శని భాధలనుండి విముక్తిచేయును.
పార్వతీశ్వరుడు: ఈ లింగము పార్వతీదేవిచే ప్రతిష్టింప బడినది. ఈ లింగారాధనవలన సర్వసౌభాగ్యములు పొంది పరలోకమున శుభగతిని పొందెదరు.ఈలింగ స్మరణ సహస్ర
జన్మ పాపములను హరించును.
గంగేశ్వరుడు: కలియుగమునందు ఈ లింగము గుప్తము.కల్మష నివారిణియగు గంగ కలియుగములో
మరియు కాశీలో దుర్లభమైన ఈ శివ లింగ దర్శనముతో పాపక్షయమగును. ఈ కధ శ్రవణమువలన నరులు నరకము పొందరు.
మరియు కాశీలో దుర్లభమైన ఈ శివ లింగ దర్శనముతో పాపక్షయమగును. ఈ కధ శ్రవణమువలన నరులు నరకము పొందరు.
నర్మదేశ్వరుడు: పూర్వం మునులందరు మార్కండేయమహర్షిని నదులలోకెల్ల ఏ నది శ్రేష్టమని అడుగగాగంగే ఉత్తమమైన నది అనిరి.నర్మద బ్రహ్మగురించి తపస్సు చేసితనకు గంగతో
సమానమైన కీర్తిని ప్రసాదించమని వేడుకొనగా బ్రహ్మ సాధ్యంకాదని తెలిపెను. నర్మద వారణాశి చేరి పిలపిలా తీర్ధమున లింగ ప్రతిష్ట చేసి తపస్సు చేసినది. ఆమె భక్తికి మెచ్చిన శివుడు వరము కోరుకొమ్మనగా శివుని పదసన్నిధి నిరంతరం కావలెనని వేడుకొనగా శివుడు మెచ్చి ఆమె ప్రవాహమందున్న
శిలలన్నియు లింగ రూపములు అవుతాయి అని వరమొసంగెను.
గంగలో
స్నానము సర్వ పాపములను నశింప చేయును. యమునలో
ఏడు దినములస్నానము పాపములను నశింప చేయును. సరస్వతిలో మూడు దినముల స్నానము పాపములను నశింపచేయును. నర్మదానది దర్శనముతో పాపములు హరింపబడును. కాశీలో
వెలసిన ఈ లింగ దర్సనము పాపములను హరించి భక్తులను పవిత్రులను చేయును.
అమృతేశ్వరుడు – తారకేశ్వరుడు -జ్ నానేశ్వరుడు – కరుణేశ్వరుదు – మౌక్షధారేశ్వరుడు – స్వర్గధారేశ్వరుడు – బ్రహ్మేశ్వరుడు – లాంగేశ్వరుడు – వృద్ధకాళేశ్వరుడు – వృషీశ్వరుడు – చండీశ్వరుడు – నందికేశ్వరుడు -మహేశ్వరుడు – జ్యొతిరూపేశ్వరుడు : ఈ పైన ఉదహరించిని లింగములు సాక్షాత్ మహాదేవునిచే ప్రతిష్టింపబడినవి. వీని నామోచ్చారణతోనే సర్వ దుఖములు నాసానమగును.
శైలేశ్వరుడు – వరుణాసంగమేశ్వరుడు – స్వర్ణేశ్వరుడు – మధ్యమేశ్వరుడు -హిరణ్యగర్భేశ్వరుడు – ఈశానేశ్వరుడు – గోప్రేక్షేశ్వరుడూ -వృషభధ్వజేశ్వరుడు – జ్యేష్టేశ్వరుడు – ఉపశాంతనశివ – నివాసేశ్వరుడు -శుక్రేశ్వరుడు – వ్యాఘ్రేశ్వరుడు - జంబుకేశ్వరుడు : ఈ 14 మహాలింగాలు వీని నామస్మరణే మోక్షప్రదము.
పైన ఉదహరించిన శివలింగములు కొన్ని మాత్రమే దర్శింపవీలు కుదిరినది. ఇంకా ఎన్నో ఎన్నేన్నో లెఖ్హకు అందనివి కాశీ నగరం చుట్తూ గంగా నదీ తీరంలో నెలకొని ఉన్నవి.
ఈరీతిలో అసంఖ్యాకమైన మాహిమోన్నతమైన విశ్వవిఖ్యాతమైన దేవి దేవతలచే ప్రతిష్టాపితమై విరాజిల్లుతున్న అనంతకోటి శివలింగములకు ఇవే అనంత కోటి ప్రణామములు.
కాశీలో వెలసిన నవదుర్గల మహిమలు
నవదుర్గలలో వెల్సిన మొదటి రూపము. హిమవంతుని పుత్రికగా జన్మించి పరమశివుని పతిగా
పొందుటకై అనేక సంవత్సరములు తపమాచరించి ఆతని పత్ని కాగలిగినది. ఈమెను
ఆరాధించిన అశేష సౌభాగ్యములను ప్రసాదించును.
రెండవ
శక్తి స్వరూపిణిగా అభివర్ణించ బడినది.ఈమెను ఆరాధించు భక్తులకు జీవితములో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనను కర్తవ్య మార్గమునుండి వారి మనసులు మరలకుండా కాపాడుతుంది.
సర్వత్రా కార్యసిద్ధి మరియు విజయములు సంప్రాప్తింపచేయు అనురాగమయి.
సర్వత్రా కార్యసిద్ధి మరియు విజయములు సంప్రాప్తింపచేయు అనురాగమయి.
నవదుర్గలలో మూడవ శక్తిస్వరూపము.ఈమెను ఆరాధించిన అత్యంత ఫలదాయకము. సతతము
తన భక్తులను భూత ప్రేత, పిశాచముల బారి నుండి కాపాడును.
ఈమెను ధ్యానించిన మనకు ఇహ పరలోకములందు పరమ కల్యాణదాయకమైన సద్గతులను ప్రాప్తింపచేయును.
ఈమెను ధ్యానించిన మనకు ఇహ పరలోకములందు పరమ కల్యాణదాయకమైన సద్గతులను ప్రాప్తింపచేయును.
నవదుర్గలలో నాల్గవ అవతారమే కూష్మాండ.బ్రహ్మాండమున్ సృష్టి చేయగల సమర్ధురాలుకావున కూష్మాండ నామముతో వెలసినది.ఈమెను ఆరాధన చేయు భక్తులను రోగములు,శోకములు దరిచేరవు.
నిర్మలమైన మనస్సుతో ఈ దేవిని శరణుజొచ్చిన వారికి ఆయురారోగ్యములు, ఐశ్వర్యములను సంప్రాప్తింప చేయును.సులభ రీతిలో తన భక్తులకు పరమపదము ప్రాప్తింప చేయు శక్తిమయిగా వెలసినది.
నిర్మలమైన మనస్సుతో ఈ దేవిని శరణుజొచ్చిన వారికి ఆయురారోగ్యములు, ఐశ్వర్యములను సంప్రాప్తింప చేయును.సులభ రీతిలో తన భక్తులకు పరమపదము ప్రాప్తింప చేయు శక్తిమయిగా వెలసినది.
నవదుర్గలలో ఐదవ శక్తిగా పేరొందిన రూపము. ఈ దేవిని ఉపాసించు భక్తుల ఈప్సితములు నెరవేరును. ఈ లోకమునందు జీవించినంత కాలము శాంతియు మరియు సుఖములను అనుభవించెదరు.
వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచియుండును. ఈ దేవి సూర్య మండల అధిష్టాత్రి అగుటవలన ఉపాసించువారు దివ్య తేజస్సుతో సూర్యదేవ ప్రసాదితమైన స్వచ్చమైన కాంతులతో విరాజిల్లు చుందురు.
వారికొరకై మోక్షద్వారము నిరంతరము తెరచియుండును. ఈ దేవి సూర్య మండల అధిష్టాత్రి అగుటవలన ఉపాసించువారు దివ్య తేజస్సుతో సూర్యదేవ ప్రసాదితమైన స్వచ్చమైన కాంతులతో విరాజిల్లు చుందురు.
నవదుర్గలలో ఆరవ శక్తి మాతగా నిలచినరూపము. ఈ దేవిని కాశీయందు దర్శనము చేసుకొని నామమంత్రము జపించిన శీఘ్రముగా ఫలములు పొందెదరు. రోగములు, సంతాపములు, భయములవంటి ఇహలోక భాధలు ఎన్నటికీ దరి చేరవు. ఝన్మ జన్మాంతరముల పాపములు నాశనమగును.
నవదుర్గలలో అతి భయంకరమైన భీతిని కలిగించే ఏడవ శక్తి రూపము. ఋఇపుల ఎదల్లో
ఎంత భయాన్ని కలిగిస్తుందో భక్తుల కనులకు అత్యంత కరుణామయిగా దర్శన భాగ్యం
కలిగిస్తుంది. సర్వ శుభంకరి. తనను ఆరాధించిన వారికి ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించునుమరియు అనంత కామితములను ఈడేర్చును.
అగ్ని, జలము, వాయువు, జంతువులు మరియు గ్రహభాధల నుండి కాపాడును. కాశీనగర రక్షకిగా అన్ని దిక్కులనుండి ఆ నగరమును మరియు నగరవాసులను సదా రక్షించును.
అగ్ని, జలము, వాయువు, జంతువులు మరియు గ్రహభాధల నుండి కాపాడును. కాశీనగర రక్షకిగా అన్ని దిక్కులనుండి ఆ నగరమును మరియు నగరవాసులను సదా రక్షించును.
నవదుర్గలలో ఎనిమిదవశక్తి స్వరూపము.ఆరాధించిన భక్తుల కల్మషములన్నియు ప్రక్షాళితమగును. స్త్రీలు సౌభాగ్యములు, పుణ్య ఫలములు పొందెదరు. ం
అనుజులు చేసినపూర్వ సంచితపాపములు నశించడమేకాక భవిష్యత్తులో ఎటువంటి పాపకర్మలు దుఖములు దరిచేరకుండా కాపాడే మహిమగల దేవి మహాగౌరి.
అనుజులు చేసినపూర్వ సంచితపాపములు నశించడమేకాక భవిష్యత్తులో ఎటువంటి పాపకర్మలు దుఖములు దరిచేరకుండా కాపాడే మహిమగల దేవి మహాగౌరి.
దుర్గా
మాతయొక్క తొమ్మిదవ శక్తి స్వరూపము. ఈ దేవి తనను ఆరాధించిన భక్తులకు సర్వ విధ సిద్ధులను ద్ధింపచేయును కావున
"సిద్ధి ధాత్రి"అను నామముతో విలసిల్లుతున్నది.తన అఖందమయమైన
మహిమతో
నిజమైన పరమానందకరమైన అమృతపధము భక్తులకు లభింపచేయ శక్తి రూపిణి.
ఈ రూపములతో కాశీనగరములో వెలసిన నవదుర్గల దర్శన భాగ్యము అత్యంత ఆనందభరితము,శుభకరమేకాక ఎనలేని శక్తిసంపదలు
మన స్వంతము అవుతాయి అనడంలో సందేహము ఎంత మాత్రం లేదు. ఈ నవదుర్గలకు ఇవే ఇవే అనంత కోటి ప్రణామములు.