"సప్తకుల
పర్వతముల ప్రతిష్ఠంభనములే భరత భూమిపై నెలకొన్న
అఖండ ఖనిజ సంపదలు"
భారత దేశములో యుగయుగాల చరితకు
తార్కాణముగా నేటికీ ధీఠుగా నిలచి
ఉన్న అతి సుందర పర్వతశ్రేణులు
"సప్తకుల పర్వతములు". సాధారణముగా ఇవి ఏర్పడటానికి ప్రకృతికి
కొన్ని కోట్ల సంవత్సరములు అవసరమే
మరి. ఇవి మనకు ప్రకృతి
ద్వారా లభించిన ఉచిత సంపదలు
మాత్రమే కాదు అవి ఎన్నో
చారిత్రాత్మిక సంఘఠనలకు, సంప్రదాయ పరంపరములకు సాక్షులుగా
నిలచి ఉన్నవి. పర్వతారోహణములో మనకు
లభ్యమయ్యే సౌందర్య వీక్షణములు, చల్లని
గాలులు, సెలయేరులు, జలపాతములు, ఎన్నో ఉపయుక్తకరమైన వృక్షసంపదలు,
సుమసౌరభములు, అఖండ ఖనిజ సంపదలు,
దుర్భరేధ్యమైన కోటలు, అనేక సుందర
దేవాలయ కట్టడములు, అతులిత శిల్పకళా వైభవముతో
నాటి భారత దేశమును సుపరిపాలన
గావించిన అనేక లక్షల పరిపాలకుల
వైభవములకు చిహ్నముగా నిలచి ఉన్నవి, ఇంతటి
వైభవోపేతమైన సప్తకుల పర్వతముల విశిష్టతలను
అతి క్లుప్తముగా విశదీకరించడమే ఈ వ్యాస
ముఖ్యొద్దేశ్యము.
1. మహేంద్ర
పర్వతం
సప్తకుల
పర్వతములలో ప్రధమ
స్థానమలరించిన అతి ముఖ్య పర్వతప్రాంతము.
హిందుమత వర్ణన ప్రకారము మహేంద్ర
పర్వతము అనగా "మౌంటెన్ ఆఫ్ ద
గ్రేట్ ఇంద్ర" అని అర్ధము. సర్వ
దేవతలకు ప్రభువుగా, స్వర్గ లోకాధిపతిగా దేవేంద్రుడు
నడయాడిన భూమి.
ఇచట లభించిన చారిత్రక ఆధారముల
ప్రకారము త్రేతాయుగములో ఈ ప్రాంతము
అనేక పొదలు, జీడిమామిడి తోటలు,
తటాకములు, నదులు, జలపాతములు, లోయలతో
అలరారిన భూమి మరియు అశేష
పశు సంపదలతో, పక్షులు, వన్య
మృగములతో, మునులు, ఋషులు, సిద్ధులు
తపమాచరించిన పవిత్రభూమి. రామాయణ మహాకావ్యములో సీతాన్వేషణ
సమయములో బయల్వెడలిన హనుమ ప్రధమ పాదము
మహేంద్ర గిరిపై వేయగా అదరిపాటుతో
పర్వత గుహలలో దాగి ఉన్న
అనేక జంతుజాలములు, నాగులు, యక్షులు, కిన్నెరలు,
కింపురుషాదులు మహేంద్ర గిరిపైనుంచి అంతరిక్షము
పైకెగరగా తరువులు ఫలములు రాల్చెను.
అనేక పుష్పములు హనుమపై జాలువారి అభిషేకము
చేయబడిన వైనము ఎంతో సుందరముగా
అధ్భుతముగా వాల్మీకి వర్ణించెను.
మహాభారత
వర్ణనలో మహేంద్ర గిరి తూరుపు
కనుమలలో బంగాళాఖాత సముద్ర తీరములో నెలకొని
ఉన్నది. ఒరిస్సా రాష్ట్రములో పర్లాకిమిడి
గజపతి వద్ద నిబిడీకృతమైనది. పాండవులు
లక్కతో చేసిన మందిరములో సజీవ
దహనమునకు ఆహుతి కావలసిన సమయములో
భూగర్భ సొరంగము ద్వారా కుంతీ
సమేతమై సురక్షితముగా చేరి తిరుగాడిన అరణ్య
ప్రాంతముగా శ్రీ వేదవ్యాస వర్ణన.
1936 లో
ఫ్రెంచ్ విజ్ఞాన వేఎత్త "ఫిలిప్
స్టెర్న్" ఈ ప్రాంతమును
దర్శించి జరిపిన అన్వేషణలో ఈ
పర్వత విశిష్ఠ్తలను అభివర్ణించి ఇచట వెలసిన మహావిష్ణువు
రూపమును మరియు ఎన్నో గురుతు
తెలియని దేవాలయములను వాటి విశిష్ఠతలను విపులీకరించెను.
ఇచట పారే నదులు ఎంతో
పవిత్రమైనవి, పరిశుద్ధమైనవిగా తెలిపెను. "చంటోర్న్ కాంగ్" నదిపై
ప్రసరింపబడిన సూర్య కిరణములతో ఆనీరు
బంగారు వర్ణములోనికి మారడము ఒక అధ్భుత
దృశ్యముగా అభివర్ణించెను. బ్రహ్మాండ పురాణము మహేంద్ర పర్వతము
ఇంద్ర మరియు శ్రీహరి కలయికలా
వర్ణించెను. విరజా క్షేత్ర మహత్యములో
గయాసురుడు శ్రీ మహావిష్ణువుచే వధించబడిన
పర్వత ప్రాంతము.
ప్టొలమీ
అను గ్రీకు శాస్త్రవేత్త మహేంద్ర
గిరి ప్రాంతము తూర్పు కనుమలలో నెలకొన్న
సుగమమైన సముద్ర మార్జము. వాణిజ్య
వ్యాపారములకు తూర్పు ఇండియా నుంచి
బంగాళాఖాతము ద్వారా పశ్చిమ దేశములతో
బలపరచినది అని తెలిపెను. కళింగప్రాంతము
వ్యాపార అనుకూల దిశలో ఉండెడిది
అను విషయము లిఖిత పూర్వక
ఆధారముల ద్వారా నాశిక్ వద్ద
లభ్యమైన శిలా శాసనములో ఎపిగ్రఫిక్
ఫొటోల ద్వారా ప్రపంచ విదితమైనది.
తొమ్మిది
నుంచి 15 సి.ఇ. ల
మధ్య కాలములో ఈ ప్రాంతము
"ఖ్మేర్" సామ్రాజ్యాధి నేతలు "అంగ్కోర్" ను రాజధానిగా ఏర్పరచు
కొని సుపరిపాలన గావించిరి. ఆ రోజులలో
ఈ ప్రాంతము "కాంబోడియా"
అనుపేర “ఖులేన్" పర్వతముగా మరియు "ఖులేన్" నగరముగా వాశికెక్కినది. "ఫ్నోం
ఖులేన్" పర్వతవాలులో నిబిడీకృతమై ఉన్నది. సుమారు 1200 సంవత్సరములకు
పూర్వము మహేంద్ర పర్వతము అంకోర్
రాజ్యమునకు ప్రధమ రాజధానిగా విలసిల్లడమే
కాక నాడు ఎందరో నాగరీకులు
ఈ తీర ప్రాంతములో
నివసించిరి
మహేంద్ర
పర్వతము హిందు బౌద్ధ మతములు
వ్యాప్తీకరింప బడిన ప్రాంతము 9వ
శతాభ్ధములో నదీ తీరములో త్రవ్విన
ఇసుక మేటలలో సుమారు వేయి
శివలింగములు లభ్యమైనవి. త్రికోణాకృతిలో నిర్మింపబడిన పిరమిడ్ వివిధ మొక్కలతో
అంచలంచెలుగా పెంపుదల చేయబడిన తీరు
ఎంతో విశేషము. ఈ ప్రాంతము
ఎన్నో ఔషధ మొక్కలు, మరియు
600 విభిన్న రంగుల పూల మొక్కలతో
నిండి ఉన్న సుందర తీరము.
కాళిదాసు
"రఘువంశ చరితలో" హర్ష వర్ధనుడు కాదంబరిలో
లిఖిత పూర్వకముగా అలహాబాద్ స్థూపముపై వ్రాసిన
శిలా శాసనములు ఈ విషయమును
వ్యక్తీకరించినవి. పర్లాకిమిడి ప్రాంతము ఒరిస్సా రాష్ట్రములో
నెలకొన్న సుందర తీరముగా వర్ణింపబడటము
ఒక విశేషమైతే సప్త
చిరంజీవులలో ఒకడుగా వెలుగులీనే అత్యంత
శక్తివంతమైన తపస్వి పరశురాముడు తపమాచరించిన
పవిత్ర భూమి. ఇదే విశేష
ఘఠన కాబోడియన్ అడవులలో (పురాతన ఖ్మేర్
నగరము) నిరూపణ అయినది.
మహేంద్ర
గిరి సముద్ర మట్టమునకు 4925 అడుగుల
ఎత్తులో అమరి ఉన్నది. 2014 లో
"బయోస్ఫేర్ రిజర్వ్ డ్” ప్రాంతముగా ప్రభుత్వము
సుమారు 4715.32 స్క్వేర్ కి.మీ
సుదూర తీరముల వరకు నిర్ణయించడము
జరిగినది. భావితరముల ఏకీకరణమునకు, భావితర రక్షణకు, అనేక
శాస్త్ర పరిశోధనలకు నెలవైన ప్రాంతముగా నాటికీ,
నేటికీ, ఎప్పటికీ నిలచి ఉంటుందని
నమ్మకము.
2. మలయ పర్వతము
భారత దేశమునకు దక్షిణ దిశగా
అమరిఉన్న ద్వితీయ పర్వత శ్రేణి
మలయ పర్వతములు. సంస్కృతములో "మలయ" అనగా “పర్వతం". ఇవి
మూడు విభాగములుగా తీర్చి దిద్దబడీనవి.
మలయ ద్వీపము
ఈ ప్రాంతములో రజితము (సిల్వర్) అత్యధికముగా
లభించు గనులు కలవు.
మంధార
సుమధుర మైన పూలతో ఫలభరిత
వృక్షములతో అలరారే ప్రాంతము. అగస్త్యాది
ఎందరో మునులు తపమాచరించిన దివ్య
ప్రదేశము.
కనకపాద
కుశదర్భలు
అధికముగా పెరిగే ప్రాంతము. దివి
నుంచి భువికి దిగిన స్వర్గమా!
అను రీతిలో అలరారు భూమి.
684 సి.ఇ. లో "తలంగ్
టుయో" అను చైనా యాత్రికుడు
తనకు లభ్యమైన శిలా శాసనముల
ద్వారా ఈ ప్రాంతము
కొబ్బరి, పోక, చెరకు, వెదురు,
చందన అనేక ఫల వృక్షములతో,
నదులు, తటాకములతో విరాజిల్లుతూ "శ్రీక్షేత్రము" అని పిలువబడెడిది. "మలయోపోలినేషన్"
నాగరీకులు ఈ ప్రాంతములో
వశించుట వలన "మలయ పర్వతము" అను
పేర వాశి కెక్కినది. చరిత్రకందని
గుర్తు తెలియని మనుష్య సంతతి
పసిఫిక్ మహా సముద్రమును దాటి
ఈ పర్వతవాలులో అనేక
భవంతులు నిర్మించి తమ వైభవమును సౌథ్,
ఈస్ట్ ఆసియా దేశములలో వ్యాప్తీకరింప
చేసిరి. మనిషిలో వెల్లువ అయ్యే
తపనకు, విజ్ఞతకు, మారు రూపుగా ఈ
ప్రాంతము అభివృద్ధి చేసిరి. వాణిజ్య వ్యాపారములకు
అనువుగా చందనముతో చేయబడిన వివిధ
పరికరములు విశిష్ట రీతిలో ఎగుమతి
చేయడములో దేశ విదేశములలో ప్రధమ
స్థానమలరించెను.
త్రేతా ద్వాపర యుగములలో ఈ
పర్వత వైభవమును ఇతిహాసములు కొనియాడగా
చేర, పాండ్యులు, తమ రాజ్యములను సంధానము
చేసికొనిరి. సంగ్ డైనాస్టీకి చెందిన
పాలకుడు "నీల ఉత్తముడు" "లార్డ్
ఆఫ్ త్రీ వరల్డ్స్" గా శ్రీత్రి
బాన వర్ణించెను. ఇతని కాలములో మూడు
ముఖ్య నౌకా కేంద్రములు వారి
రాజ ఠీవితో, సంస్కృతీ సంప్రదాయములతో
న్యాయ స్థానములతో, పాల్మ్ బంగ్, సింగపూర్,
పెనిన్సులా తీరములలో ఏర్పరచి సముద్రయానమును
అభివృద్ధి పరచెను. ఇచట ప్రవహించు
"మయునది" నీటిని కాలువల ద్వారా
ప్రవహింప చేసి వేల కొలది
ఎకరముల భూమిని సస్య శ్యామలముగా
తీర్చిదిద్దిరి. ఈ విషయము
11వ శతాభ్ధములో "పౌల్
వీటల్" అను భూగోళ శాస్త్రజ్ఞుడు తంజావుర్లో
లభ్యమైన శిలాశాసనము ద్వారా మలయ పర్వత
విశిష్ఠతలను జగతికి నివేదించెను. ఒరిస్సా
రాష్ట్రములో తూరుపు కనుమలలో నెలకొన్న
"గర్హట్” పర్వతము
అనుగుర్ జిల్లాలో, "పలాహరట్" జిల్లాలో నెలకొన్న మలయ
గిరి చూపరులను ఆకర్షించి అందమైన
కొండలు, పీఠభూములు, హరిత వర్ణముతో శోభిల్లే
పచ్చిక బీళ్ళు, తూర్పున ఉత్కళ
మహానది బేసిన్, ఉత్తరమున చోఠానాగ్పూర్
పీఠభూమి ఎంతో అధ్భుతమైన సుందర
ప్రాంతములు.
1015లో బౌద్ధులు "అష్టా శహ శింక
ప్రజ్ఞ పరమత” అను గ్రంధములో అద్భుత
వర్ణనలు చేసిరి. ఈ ప్రాంతములో
లభ్యమైన సువర్ణ, రాగి, కంచు,
నాటి పాలకుల విగ్రహములను ఆవిష్కరింప
చేసి వాటిని విలువైన వజ్రములు,
గాజు పూసలు, మరియు అందమైన
రంగు రాళ్ళతో అలరింప చేసిరి
అనునది చారిత్రక ఆధారములతో నిరూపణమైనది.
3.సహ్యపర్వతములు
సప్తకుల
పర్వతములలో తృతీయ స్థాన మలరించినవి
"సహ్యపర్వతశ్రేణి"
పశ్చిమ కనుమలలో నిబిడీకృతమై ఉన్నవి.
సంస్కృతములో "సహ్య" అనగా “సహనశీలి" అని
అర్ధము. అందువలన ఈ పర్వతములకు
"సహ్యద్రి" అను పేరు సుస్థిరమైనది.
ఈ శిఖరశ్రేణి వరుస
క్రమములో ఎటువంటి విస్ఫోఠములు లేకుండా
అరేబియా సముద్ర తీరమునకు అతి
సమీపములో నెల కొని ఉన్నవి.
సుమారు
150 మిలియన్ సంవత్సరములకు పూర్వము (గోండ్వానా కాలములో)
ఏర్పడటము ఒక విశేషమైతే బాక్సైట్,
అలూమినియం, సున్నపురాయి ఏంత్రోసైట్, లెగ్నైట్, ఆదిగా గల ఎన్నో
ఖనిజములు అత్యధికముగా లభ్యమవడము మరొక విశేషము.
ఈ ప్రాంతము మట్టి కొండలతో
ఏర్పడుట వలన వర్షపాతము అధికము
కావున మట్టి పెల్లలు మహా
వృక్షములతో విరిగి పడటము సర్వ
సామాన్యము. ఈ విఘాతము
అరికట్టడాఆనికి 2011 లో "వరల్డ్ హెరిటేజ్"
గా గాడ్గిల్ కమిటీ
ఏర్పరచెను. కొన్ని ప్రాంతములను ఈ
ప్రమాదము నుండి రక్షించుటకు నిర్ణయించిరి.
2012లో ఈ ప్రక్రియ
పశ్చిమ కనుమల తీర రక్షణకు
సన్నిద్ధ మైనది. నా ఉద్దేశ్యములో
మట్టి కొండ ఒకచోట కూలితే వేరొక
చోట అదే మన్ను గుట్టగా
ఏర్పడుతుంది. కావున విరిగి పడిన
చెట్లను ఆ గుట్టలపై
పునఃస్థాపితము చేసిన భూక్షయము నివారింప
బడటము, మరియు కొండల పైనుండి
జాలువారే వర్షపు నీరు లోతట్టు
ప్రాంతములను నీటి వరదలతో ముంచేయడము
అను అనివార్య సంఘఠనల నుంచి
కాపాడగలము.
తూర్పు దిశలో నెలకొన్న మధ్య
కర్ణాటకా విభాగము "మళెనాడు" అనగా అధిక వర్ష
ప్రాంతము గా అబివర్ణించ బడినది.
వేసవి విడిదులుగా పేరొందిన ఊటీ. కొడైకెనాల్,
అన్నాముడి చల్ల దనమునకు పేరొందినవి.
"వాయ్నాడు" ప్రకృతి సౌందర్యముతో అలరారుతున్నది.
1860-1950 మధ్య కాలములో ఆంగ్లేయులు అభివృద్ధి
పరచిన "ప్లాంటేషనల్ క్రాప్స్”
(కాఫీ, టీ, రబ్బరు, సుగంధ
ద్రవ్యములు) నేటికీ చెదరని రీతిలో
అలరారు తున్నవి. కేరళ ప్రాంతము సుగంధ
ఫలభరిత వృక్షములతో, టేక్, చందన మరియు
కొబ్బరి సదా హరిత భరితమైన
తోటలతో "సైలెంట్
వేలీ" గా పేరొందినది. 160000 వేల
పూల మొక్కలతో ఈ ప్రాంతమును
అలరింప చేసిరి.
సహ్యాద్రి
పర్వతములు కేరళ, తమిళ్నాడు, కర్ణాటక
రాష్ట్రములలో కురిసే మంచుతో హిమపర్వతములను
తలపింపే రీతిలో ఒక్క హరిత
వర్ణములోనే 50 రకములతో విలసిల్లే వాతావరణమును
పెంపొందింప చేసి కోట్ల కొలదీ
పర్యాటకులను అనునిత్యము ఆకర్షించడము ఒక వింతే. సహ్యాద్రి
సౌందర్యమును కన్నడనాడిన కవి కె.ఎస్.ఆర్. నిస్సార్ అహమ్మద్
ఈ రీతిలో వర్ణించెను.
"జోగద
సిరి బెళకినల్లి-తుంగెయతన బళుకినల్లి
సహ్యాద్రియలోహదరిల-ఉత్తుంగద నిలుకునల్లి
నిత్యహరిద్వర్ణవనద-తేగ గంధ తరుగళల్లి
నిత్యోత్సవ
తాయినిత్యోత్సవ నినగెనిత్యోత్సవ"
అనగా సహ్య పర్వతముల నడుమ
ప్రవహించే నదుల జలపాతములు ప్రసరించే
విద్యుత్చ్హక్తి వెలుగులు అనేక లోహ
సంపత్తులు, ఎప్పటికీ అంతమవని హరిత
వర్ణముతో సుశోభితమైన చందన తరువులు, విభిన్న
వర్ణ పుష్ప సౌరభ్యములు నిత్యమూ
ఉత్సవభరిత వాతావరణములతో అలరారే పుణ్య భూమిగా అబినందించెను.
కన్నడ దేశములో ప్రతీ ఇంట,
ప్రతె నోటా, ఆలపించ బడే
ఆత్యధ్భుత సుందర సరళ గీతమే
ఇది. అందాన్ని వర్ణించుతూ "ఎ
థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్
ఎ జాయ్ ఫరెవర్"
అని ఆంగ్లకవి “జాన్ కీట్స్" తెలిపెను.
"అందమె ఆనందం ఆనందమే జీవిత
మకరందం" అని సినీ దిగ్గజకవి
సముద్రాల సీనియర్ వర్ణించగా, ఇస్లామిక్
ప్రవక్త “మహమ్మద్ ప్రాఫిట్" అందమైన
ముఖము, స్వచ్చమైన జలం హరిత వర్ణము
ఒక జాతి అభివృద్ధికి
దోహద మవుతాయి అని తెలుపడము
విలువ కట్టలేని పద ప్రయోగములే.
ఈ ప్రాంతములో సుప్రశిధ్హ దేవాలయములలో వివిధ శిలాకృతులను వ్యక్తపరచడము
సృష్టిలోని వింతే.
కుద్రేముఖ్
ఈ శిఖరము గుర్రము యొక్క
ముఖ తీరులో ఏర్పడినది.
బిళిగిరి
శ్వేత వర్ణ శిలపై 200 సంవత్సరాలకు
పూర్వము వెలసిన శ్రీ రంగనాధస్వామి
నేటికీ ఆరాధింపబడటము విశేషము.
కుమారస్వామి
వెలసిన శేష పర్వత శిఖరము
ఆరుతలల సర్పాకృతిలో ఉన్నది.
గోకర్ణము
సాక్ష్హాత్
పరమేశ్వరుడు గోవు చెవి ఆకృతి
నుంచి ఉద్భవించెను. ఈ నమూనా
గంగావళి ప్రాంతమునుంచి ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించినది అనునది
చారిత్రిక నిరూపణ,
అలవి కాని అంద చందములతో
అలరారే సహ్యాద్రి పర్వత వీక్షణములో బ్రహ్మగిరి
మకుటమే "డియండ్ మోల్" ఇంకా
ఎన్నో ఎన్నెన్నో వింతలతో సౌందర్య నిధులతో
నెలకొన్న సహ్యాద్రి అవరోహణ ఎనలేని తృప్తిని,
భక్తితత్పరతలను పెంపొందింప చేయడములో సందేహము ఎంత
మాత్రమూ లేదు అని నా
ఉద్దేశ్యము.
4. పారియాత్ర
(సాత్పురా) పర్వతము
సప్తకుల
పర్వతములలో నాల్గవ అతి ముఖ్యమైన
పర్వతశ్రేణి "పారియాత్రపర్వతము" గా అబివర్ణించ బడినది.
వింధ్య పర్వతములకు దిగువున అమరి ఉండటము
వలన "వింధ్యపదములు" గా వరాహ పురాణము
కీర్తించెను. సంస్కృతములో "సత్పురా" అనగా శత పురములతో
సుశోభితమైన ప్రాంతము కావున "శతపుర"
అను పేరుతో విరాజిల్లి కాలక్రమమున
"శాత్పురా" అని నామాంకితమైనది.
హరివంశ పురాణము ప్రకారము ఈ
పర్వత దిగువ ప్రాంతము దైత్యులకు
నివాస స్థలముగా పేరొందినది. కానీ
మహాభారత వర్ణనలో శ్రీకృష్ణుని ద్వారా
దైత్యులు వెలుపలికి రాని విధముగా నగర
ద్వారము ఎప్పటికీ మూసివేయ బడినది
అనునది పురాణోక్తి. పారియాత్ర పర్వతశ్రేణి ఉత్తర దక్షిణ భారత
దేశములకు నడుమ నిబడీకృతమై మేరువునకు
పశ్చిమ దిశలో నెలకొని ఉన్నవి.
గంగ, యమున నదుల నడుమ
వెలసి ఉన్నందున భారతమాత జఘన
విభాగముగా సరిపోల్చడము విశేషము. మహాభారతములో ఈ
పర్వతములు "సనపద" అను పేరుతో వర్ణించబడితే
శ్రీకృష్ణుడు "పారియాత్ర" అని నామాంకితము చేసెను.
ఈ ప్రాంతము సుందరమైన హరిత
వర్ణముతో సుశోభిల్లు వేసవి విడుదులు అనేకము
ఉన్న "పచ్మరి"
ముఖ్యమైనది. ఈ పర్వత
ప్రాంతము అందములో "మహారాణి” గా అభివర్ణించ బడినది,
మరియు ప్రకృతి సంపదలతో రూపు
దిద్దుకొన్నది. ఈ శిఖర
ప్రాంతములలో పర్వతారోహణము పర్యాటకులకు ముఖ్య వేడుక. ఈ
పర్వత సౌందర్యమును సినీపరిశ్రకు చెందిన ఎందరో ప్రముఖులు
తమ సినీ జగత్తులో
అలరించడము ఒక ముఖ్య విశేషము.
మధ్యప్రదేశ్ లో నెలకొన్న "అమర్కంటక్"
నగరము "తీర్ధరాజు" కింగ్ ఆఫ్ పిలిగ్రమేజ్
గా వర్ణించిరి. ఇచట
నర్మద, సోని, జోహిలా నదుల
సంగమ వీక్షణము అత్యంత ప్రశిద్ధి
చెందినది.
ముక్తగిరి
ప్రాంతములో సుమారు 52 దేవాలయములు నెలకొని ఉన్నవి. వీని
సమీపములో ప్రకృతి ప్రసాదించిన వనములతో,
జలపాత ఘోషలతో నిండి ఉన్న
ప్రదేశములో వెలసిన దేవీ దేవతా
మూర్తులు సందర్శనము ద్వారా లభించే ఆశీస్సులకి
ఎప్పటికీ విలువ కట్తలేము.
వర్ష ఋతువులో ఈ పరిసరములు
ఎటుచూసినా హరిత వర్ణముతో నిండి
ప్రకృతి ఆకుపచ్చని చీర ధరించినదా అను
రీతిలో సందర్శకులను అధ్భుత రీతిలో సందర్శకులను
ఆకట్టుకొనడము సృష్టిలోని వింతేమరి. ఆఫ్ఘనిస్థానుకు, దబద్-ఇ-బాబాబంద్
తుర్కిస్థాన్ పర్వత శ్రేణులు దక్షిణ
దిశగా వ్యాప్తి చెంది ఆగ్నేయ
దిశలో భారత దేశములో తక్కువ
ఎత్తులో అమరి సాత్పుర పర్వతములుగా
మారినవి.
అత్యధిక
భాగము దట్టమైన అడవులతో నిండి
అరుదైన మృగములు బెంగాల్ టైగర్,
గౌర్, ధోలే, స్లాత్బియర్, బ్లాక్
బక్, ఏనుగులు, పులులు, సిమ్హములు
ఆదిగా గల ఎన్నో వన్యమృగములు
సంచరించు ప్రాంతము. సాత్పురా పర్వతములు మధ్య
భారత దేశములో నెలకొని గుజరాత్,
మహారాష్ట్ర, చట్టిస్ఘర్, మధ్య ప్రదేష్ ఆదిగా
గల ఎన్నో రాష్ట్రములను
తలపడము ఒక విశేషమైతే భారత
దేశమునకు ఉత్తర దక్షిణ భాగముల
నడుమ నెలకొని గోదావరి, మహానది,
నర్మద, తపతి, క్రిష్ణ నదులకు
జన్మ స్థానముగా పేరొందినవి. నదముగా పేరొందిన నర్మదా
నది వింధ్య-సాత్పుర పర్వతముల
నడుమ తూరుపు దిశలో ఉధ్భవమై
పడమర దిశలో భారత దేశమునకు
మధ్య ప్రవహించి అరేబియా సముద్రములో విలీనమైనది.
ఇంత సౌందర్య వీక్షణములతో అలరారే
పారియాత్ర పర్వతశ్రేణి పద దర్శనము ఎంతో
ముక్తిదాయకము మరియు ఆనందదాయకము అనినేనంటాను.
మరిమీరే మంటారు?
5. వింధ్య
పర్వతము
ఇతిహాస పరముగా నిలచిన పంచమ
పర్వతశ్రేణిగా నెలకొన్న అతి పురాతనమైన
వైభవోపేతమై నిలచినవి "వింధ్యపర్వతములు". పురాణోక్తుల ప్రకారము పర్వతములకు రెక్కలు
కలిగి ఉండెడివి అందువలన అవి
తమకు కావలసిన రీతిలో ఎగిరే
శక్తి కలిగి జన జీవనమును
అల్లకల్లోలము చేసెడివి. ఇంద్రుడు తన వజ్రాయుధముతో
ఆ పర్వతముల యొక్క
రెక్కలు ఖండించి అవి పడిన
ప్రదేశములలోనే వాటికి స్థిర జీవనమును
సంప్రాప్తింప చేసెను. ఇంద్రుని ఆయుధమునకు
బెదరిన వింధ్య మాత్రము సముద్రములో
దాగెను. సీతాన్వేషణ సమయములో సముద్రము లంఘించు
హనుమకి సహాయకారిగా నిలచి ఆతిధ్య మివ్వదలచిన
వింధ్యను చూసి తన దారికి
అడ్డంకిగా భావించి హనుమతన ఎదతో
ఢీకొనగా చిన భిన్న మాయెను
అనునది ఒక రామాయణ సంఘఠన.
ఒకానొక సమయములో వింధ్య అతి
గర్వముతో మేరు పర్వతముతో ధీఠుగా
సమాన రీతిలో వ్యాప్తీకరించి అనేక
రీతుల విస్తరించి సూర్య కాంతి భువిపై
ప్రసరించుటకు వీలుకాని రీతిలో అవరోధ
పరచెను. దేవతలు అగస్త్య మహర్షిని
వేడుకొనగా వింధ్య గర్వమణచ సంకల్పించి
దక్షిణ భారత దేశ యాత్రకు
సతీసమేతుడై బయల్వెడలెను. వింధ్య వారిపై గౌరవముతో
తలవంచి నమస్కరించెను. తరువాత కాలములో అగస్త్య
మహర్షి దక్షిణ దేశములోనే స్థిర
నివాసమేర్పరచు కొనగా వింధ్య పెరుగుదల
లేక నిలచిపోయెను అనునది నాటినుంచి నేటివరకు
ఒక ఇతిహాసిక కారణము.
సంస్కృతములో
విన్+జ = వింధ్య అనగా
అనేక శ్రుంఖలములతో విడివడి నటుల సాక్షాత్కరించు
పర్వతశ్రేణి. మహా-భారతములో వ్యాసుని
వర్ణన ప్రకారము ఈ ప్రాంతము
అటవీకుల పరిపాలకుడైన "నిషధ” రాజు కాలములో స్థానికులు
వేటనే ముఖ్య వృత్తిగా స్వీకరించిరి
కనుక "వైంద్" అనగా వేట అని
అర్ధము. అమర కోశ వివరణములో
"వైంద్" అనగా అవరోధముగా నిలచినది
అను అర్ధము. సూర్య కాంతి
ఇలపై నిలుపచేయుట ఒక కారణమైతే ఉన్నత
శిఖరములతో, భయకర కౄర మృగములతో
జలపాత ఘోషలతో, దాట సఖ్యము
కాని అడవులతో చిన్నాభిన్న మైన
కొండలతో, ఉత్తర దక్షిణ భారత
దేశములకు మధ్య నెలకొన్నది. దుస్సాధ్యమైన
రీతిలో అమరిన వింధ్య ఒక
పర్వతము కాదు. భారత దేశమునకు
ఉత్తర దిశగా ఉత్తరప్రదేశ్, బీహార్,
తూర్పున చత్తీస్ఘర్, పశ్చిమమున గుజరాత్, దక్షిణమున కిష్కింద
(కర్ణాటక) వరకు వ్యాప్తీకరించినది.
కౌశిక్ ఉపనిషత్ వింధ్య చరిత
వర్ణనలో "సాత్పురా" వింధ్య పదములతో సరిపోల్చెను.
బ్రహ్మ, విష్ణు పురాణములు "రిక్స్"
పర్వతములు వింధ్య ఏర్పడుటకు మూలాధారములుగా
తెలిపెను. గౌతమీ పుత్ర శాతకర్ణి
మధ్య భారతములో నెలకొన్న మూడు
పర్వతములు -వింధ్య, సాత్పురా మరియు
పారియాత్ర వింధ్య ఏర్పడుటకు మూలాధారములుగా
తెలిపెను. “ప్టోలోమీ” అను గ్రీకు భౌగోళిక
శాస్త్రజ్ఞుడు ఈ పర్వతములను
"విందూయిస్" గా తెలిపి "నమడోయస్” (నర్మద)
ననగౌనా (తపతీ) నదుల ప్రాముఖ్యతలను
తెలిపెను. రామాయణం లో వాల్మీకి
వింధ్య పర్వత వర్ణన చేస్తూ
కిష్కింద వైభవము వర్ణించెను.
శక్తిరూపిణి,
అభయప్రదాయినీ, కరుణామయిగా నెలకొన్న "వింధ్యవాసిని" ఈ పర్వత
శ్రేణిలో వెలసి భక్తకోటిచే నిత్య
పూజలందుకొని తన పేరునే "వింధ్యవాసిని"
గా తలపింప చేయు
మనోన్మయి సతీశక్తి స్వరూపిణి.
శ్రీలలితా
సహస్ర నామాలంకృతయై విరాజిల్లే దేవీ వర్ణనలో "విశ్వాధికా
వేదవేద్యా-వింధ్యాచల నివాసినీ విధాత్రీ వేద
జననీ విష్ణుమాయా విలాసినీ" అని కీర్తించ బడినది.
వింద్య పర్వతములు నేటి సాంకేతికపర విజ్ఞానముతో
ఎంతగానో అభివృద్ధి చెంది ఉత్తర దక్షిణ
భారత దేశముల నడుమ వంతెనగా
ఏర్పడి వారి వారి సంస్కృతీ
సంప్రదాయములను, భోజన రీతి రివాజులను,
విభిన్న వస్త్రధారణలను, విభిన్న భాషలను సంగీత
సాహిత్య ఏకీకరణములను పరస్పర స్నేహ సంబంధములను
పెంపొందింప చేయుటకు, జన స్థిర
నివాసములకు దోహదకారిగా వింధ్య పర్వతములు సంప్రదాయ
వంతెనగా" (ట్రెడిషనల్ బ్రిడ్జ్) ఎంతో సహాయ సహకారములను
పెంపొందింప చేయుటలో విలువ కట్టలేని
ప్రకృతి మనకు ప్రసాదించిన అపూర్వ
సహజ సంపదే "వింధ్యశ్రేణి"
మన జాతీయ గీతములో "వింధ్య
హిమాచల యమునా గంగ ఉచ్చల
జలధిత రంగ"
అని ఈ పర్వతముల
కీర్తిని నుతించడము మన దేశ కీర్తి
ప్రతిష్ఠలకు గర్వ కారణము అని
నేనంటాను. మరి మీరేమంటారు?
6. గంధమాధన
పర్వతము
సప్తకుల
పర్వతములలో ప్రఖ్యాతి చెందిన అతి
పురాతన పర్వతశ్రేణిగా నెలకొన్నది. గంధమాధన పర్వతము "దక్షిణ
భారత చివ్రిగా అతి చిన్న
ద్వీపప్రాంతము రామేశ్వరమునకు ఉత్తర పశ్చిమ దిక్కులలో
అమరిఉన్నది. సీతాన్వేషన సమయములో సముద్రము లంఘించిన
హనుమ ఈ పర్వతముపై
నిలచి వైభవోపేతమైన లంక పట్టణ శొభను
తిలకించెను. పంబ దీవికి మూడు
కి.మీ దూరములో
నెలకొని ఉన్న రామేశ్వరములో 1964 లో
వెల్లువెత్తిన తుఫాను భీభత్సము "ధనుష్కోడి"
ప్రాత గ్రామములను సంపూర్ణముగా నాశనము గావించి జన
జీవనమును అతలా కుతలము గావించి
శ్మశాన బీడుగా మార్చినది.
ధనుష్కోడి
ప్రాంతములోని సముద్ర తీరము శ్రీరాముని
ధనస్సు ఆకారము పోలి ఉండటము
ఒక విశేషమైతే అశేష
కోటి వానరులచే నిర్మింపబడిన రామసేతువు
నిర్మించుటకు శ్రీరాముడు వేసిన మొదటి బాణము
ఈ ప్రాంతములోనే అనునది
రామాయణ విశ్లేషణ. అందు వలన తమిళ
భాషలో "ధనుష్" అనగా "విల్లు" “కొడి” అనగా "బాణము"
కనుక "ధనుష్కోడి" అను పేరుతో రూపాంతరము
చెందినది.
పురాణోక్తి
ప్రకారము హనుమ నాలుగు యుగములలో
చిరంజీవత్వముతో తిరుగాడు వైనము నేటికీ
నిరూపణమై ఉన్నది.
కృత యుగము
ఈ యుగములో ప్రచండ రౌద్రాకారముతో
మూర్తీభవించిన రుద్రుని అంశతో శక్తికి
ప్రతిరూపమైన ఆదిశక్తికి కుమారునిగా జన్మించెను. శక్తికి, యుక్తికి ప్రతీకగా అఖండ
బ్రహ్మచర్య దీక్షతో, అతులిత విజ్ఞాన
సంపదలతో చెడును నాశనముచేయు గుణముతో,
చిరంజీవత్వముతో అవతరించిన భగవత్ స్వరూపమే హనుమ.
త్రేతా యుగము
శ్రీరామ
బంటుగా రామాయణ మహా కావ్యములో
వాల్మీకిచే కొనియాడబడి అనేక అధ్భుతములను చేసి
చిరంజీవత్వమును పొందెను. అతివేగ చరితుడై
సూర్యభగవానునితో సమ వేగముతో పయనించి
విద్యను అభ్యసించెను.
ద్వాపర యుగము
పాండవులు
అరణ్యవాస సమయములో భీముడు సౌగంధికా
పుష్పముల కొరకు హనుమను కలసినది
ఈ పర్వత ప్రాంతములోనే.
ఆతని ఆశీర్వాదముతో "జండాపైకపిరాజు" గా వారి యుద్ధరధముపై
వెలసి పతాక రూపములో ఎగురుతూ
వారికి యుద్ధములో విజయము సంప్రాప్తింప చేసెను.
కలి యుగము
హనుమ తన చిరంజీవత్వమును నిరూపణము
చేసికొన గలిగేది ఎచ్చోట రామకధ
కీర్తన జరుగునో అచట నివశించును.
రామ నామ స్మరణముతో భక్తులను
సర్వ దుఃఖముల బారి నుండి
సమ్రక్షించును అనునది అధ్భ్త రహస్యము.
కృత్రిమ భక్తులకు, తాంత్రిక దుష్ట శక్తులకు,
వితండ వాదములతో బానిసలై తిరుగాడు
జనులకు హనుమశక్తి అంచనాలకు అందదు.
ఈ పర్వతముపై నెలకొన్న శ్రీరామ పాదముల
చక్రముపై నిక్షిప్తమై నేటికీ ఉన్నవి. భక్త
కోటికి ఇచట హనుమ దర్శనము
సంకట విమోచనము, శాశ్వత ముక్తిపద సోపానము.
సుమేరు పర్వతమునకు నాలుగు దిక్కులలో గంధమాధన
పర్వతము తూర్పు దిశగా వెలసినది.
రావణుడు ఈ ప్రాంత
పాలకుడైన కుబేరుని జయించి పుష్పక
విమానమును అపహరించెను. రావణ వధనానంతరము శ్రీరాముడు సపరివార
సమేతుడై అయోధ్యను తలపిన తదనంతరము
విభీషణుడు రాముని ఆజ్ఞతో ఆ
విమానము కుబేరుని రాజ్యము చేర్చబడినది.
సముద్ర జలములతో విభీషణుని లంకాధి
పతిగా అభిషిక్తుని చేసిన సంఘఠన రామాయణములో
రూపుదిద్దుకొన్నది. ఈ పర్వతముపై
రామలక్ష్మణ విభీషణులతో దర్శనము ఒక విశేషమైతే
సీతాదేవి ప్రతిమ కొంత సమీపములో
దక్షిణ దిక్కుగా తిరిగి ఉండటము
మరొక విశేషము. శ్రీరాముని "శోకరామునిగా"
అభివర్ణించగా ఎన్నో ఎన్నెన్నో రామాయణ
యుద్ధకాండకు సంభంధించిన ఎన్నో విశేషములకు తార్కాణము
గంధమాధన పర్వతము.
ఈ ప్రాంతము అనేక ఔషధ
వృక్షములకు సుప్రసిద్ధము. ముఖ్యముగా "సంతాన వృక్షములు" అధికముగా
పెరుగు ప్రాంతము. శ్రీమణి ద్వీప వర్ణనలో
మణి ద్వీపేశ్వరిని కీర్తిస్తూ
"సంతాన
వృక్ష సముదాయములు – మణిద్వీపానికి మహా నిధులు" అనగా
ఈ వృక్ష బలిమి
మానవ సంతతిని అభివృద్ధిపరచుట, ఎన్నో
వ్యాధులు నివారింప చేసి మృత్యు
భీతి నుంచి సమ్రక్షించి ఆరోగ్యమును,
ఆయువును ప్రసాదింప చేయును అను ప్రగాఢ
నమ్మకములకు దోహద పడినవి. హిమాలయ
ప్రాంతములో ఈ వృక్ష
సంపద అధికము. హనుమ సంజీవిని
పర్వతమును వెలికి తెచ్హిన సందర్భములో
అనేక వేరులు, మూలికలు, బీజములు
ఈ పర్వత ప్రాంతములో
పడి సంతాన వృక్షముల పెరుగుదల
సాధ్యమైనది.
పృధ్విలో
సమస్త జీవరాశుల వృద్ధికి కారణ
కర్త అయిన "కశ్యపమహర్షి" తపమాచరించిన పవిత్ర భూమి. అందు
వలననే అవనికి
"కశ్యపి" అను పేరు సార్ధకమైనది.
అనేక గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసలు, సిద్ధులు, ఋషులు, మునులు తిరుగాడిన
పుణ్య ప్రదేశము.
"కుమారసంభవము"
అను కావ్య రచన చేసిన
కాళిదాసు ఈ పర్వత
వైభవమును వర్ణించుతూ “పౌరాణిక నగరము" (మైథికల్
సిటి) గా ఆ గ్రంధములో
వివరించెను. దత్తాత్రేయుడు ఆధ్యాత్మిక సహాయత కొరకు అనేక
విజ్ఞుల విజ్ఞతతో కూడిన వాగ్వాదములు
జరిపి అద్వైత వేదాంత విషయములను
కూలంకుషముగా చర్చించి "త్రిపుర రహస్యము" అను
గ్రంధమును ఆవిష్కరింప చేసెను.
యుద్ధ వీరుడు, ఆధ్యాత్మిక సంపన్నుడుగా
వెలుగులీనే పరశురాముడు అనేక వేదాంత విషయములను
తపస్సమాధిలో సంప్రాప్తింప చేసికొని జనన మరణ
చక్రముల రహస్యమును తన శిష్యులకు ఈ
పర్వత ప్రాంతములో నెలకొన్న "పంబ ద్వీపము" వద్ద
వివరించెను.
కౌరవ పాండవుల గురువైన ద్రోణాచర్యులు
వారికి యుద్ధరీతిని, యుద్ధనీతులను విశదీకరింప చేసి వారిని వీర
యోధులుగా తీర్చిదిద్దిన ప్రాంతము. శత్రువులకు భయభీతులను కలిగింప చేసి ఎందరో
వీరులను సునాయాసముగా ఓడింప చేసి విజయమును
సంప్రాప్తింప చేసుకొన్నది ఈ పర్వత
ప్రాంతములోనే అనునది మహాభారత విశ్లేషణముగా
రూపు దిద్దుకొన్నది.
పూర్వము
అనేక గుహలు, ఫలభరిత, ఔషధ వృక్షములు,
పీఠభూములు, పవిత్ర తీర్దములతో వెల్లివిరిసిన ప్రాంతము.
ఇలావృత వర్షములో (గ్రీన్ ల్యాండ్) రెండు
ప్రసిద్ధ పర్వతములు నెలకొన్నవి
మలయ వన
పశ్చిమ దిశలో వెలసిన పర్వతము
సదా మంచుతో కప్ప బడిన
ప్రాతముగా "శ్రీదేవీ భాగవతము” లో ప్రస్తావించ బడినది
ఇచ్చోట పార్వతి పరమశివుని ఆరాధన
చేసి తల్లీనమవడము అధ్భుత విశేషము.
గంధమాధ వనము
ఇది తూరుపు దిశలో నెలకొన్నది.
ఇచట సుమారు 50000 పైన స్థానికులు ఆయుర్వేద
విద్యలలో ఆరితేరి అఖండ ప్రజ్ఞను
బర్గర్, బలంజీర్ జిల్లాలలో వెలసిన
ఆయుర్వేద కళాశాలలో 500 వైద్యులు విభిన్న జాతుల
వైద్య శాస్త్ర సంభంధిసిత ఉపయుక్తకరమైన
వృక్షములపై విజ్ఞతను పెంపొందింప చేసుకొనడము
అధ్భుతమే. ఈ పర్వతము
నుండి ఈ విజ్ఞానము
ఆంధ్ర, ఒరిస్స, తమిళ్నాడు, మరియు
ఎన్నో భారత దేశ విభాగములకు
ముఖ్య నౌకా కేంద్రముల ద్వారా
వ్యాప్తీకరింప చేయడము నాటికీ నేటికీ
లభ్యమవుతున్న విశేష ప్రక్రియ.
ఫల కుసుమ భరిత చల్లని
జలపాతములు, సహజ అలంకారములుగా శోభిల్లే
గంధమాధన ప్రాంతములో దేవతలు విహరిస్తారు. వారి
పాద స్పర్శతో అవని పావనమౌతుంది
ఎప్పటికీ అని నేనంటాను. మరి
మీరేమంటారు?
7.మాల్యవంత
పర్వతము
సప్తకుల
పర్వతములలో వెలుగులీనే అతి ముఖ్య పర్వతశ్రేణి
మాల్యవంతపర్వతము. కర్ణాటక రాష్ట్రములో హంపీ
క్షేత్ర సమీపములో తుంగభధ్రా నదీ
తీరములో (పంపా నది) నిబిడీకృతమై
ఉన్నది. వింధ్య పర్వతములు సుదీర
తీరము వరకు వ్యాప్తీకరించి ఇచట
"మాల్యవంత పర్వతము" గా రూపు దిద్దుకొన్నవి.
రామాయణ ఇతి వృత్తాంతమునకు సంభంధించిన
ఎన్నో తార్కాణములు ఈ పర్వత
ప్రాంతములో గోచరమౌతాయి. తుంగభద్ర నది ఆ
కాలములో "పంపా సరోవరము” గా వాశికెక్కినది. కాలక్రమేణ
"పంపాపురము" అను పేరు హంపి
నగరము గా పేరొందినది. దట్టమైన
అడవులతో, దుర్భేధ్యమైన
కొండ శిలలతో "దండకారణ్యము” గా మార్పొందిన ప్రాంతము.
కన్నడ భాషలో "కిష్కింద" అనగా "దేవనగిరి". వన+నర=వానర
వనములలో సంచరించు అడవి మనుషులను
(ఏప్స్) పోలిన వానరముల సురక్షితముగా
సుగ్రీవుని ఆధ్వర్యములో తిరుగాడు “కిష్కింద రాజ్యము” గా రామయణ కాలములో
ఎన్నో ముఖ్య సంఘఠనలకు ప్రశిద్ధిచెందిన
ప్రాంతము.
సృష్టికర్త
అయిన బ్రహ్మ నాలుగు వేదములు,
నాలుగు దిక్కులు, నాలుగు కులములు నాలుగు
సరోవరములు సృష్టించెను.
మానస సరోవరము - కైలాస పర్వతప్రాంతము
బిందు సరోవరము – గుజరాత్ లో సిద్ధాపురప్రాంతము
నారాయణ సరోవరము – గుజరాత్ లో కచ్
ప్రాంతములో
పంపా సరోవరము – హంపీ క్షేత్రము ( కర్ణాటక)
పైన తెలిపిన నాలుగు సరోవరములలో
గంగ నీరు మిళితమై ఉన్నందున
మనుజుల పాపములను పరిహరింప చేయు
శక్తి ఆ జలమునకు
సంప్రాప్తమైనది.
సీతా అన్వేషణలో దక్షిణ దిక్కుగా తలపిన
రామలక్ష్మణులను ప్రప్రధమముగా దర్శించిన హనుమ వారిని తన
భుజములపై నీడుకొని మాల్య పర్వతారోహణ
చేసి వానర రాజు సుగ్రీవుని
వద్దకు చేర్చెను. అగ్ని సాక్షిగా మిత్రులైన
తదనంతరము ఆనవాలుగా సెత జార
విడిచిన నగల మూటను శ్రీరామునికి
సమర్పితము చేసిన వైనము రామలక్ష్మణులకు
ఆమె జాడ అరయుట అను
ఒక ఆశకు ఆలంబనము
లభించెను. తదనంతరము వాలిని వధించి
సుగ్రీవుని రాజ్యాభిషిక్తుని గావించి సీతాన్వేషణలో వానర
సహాయ సహకారములు పొందిన ప్రాంతము. “క్షేమము
సీత" అను వార్తను రామునికి
తెలిపి ఆమె ఒసగిన ఆనవాలు
సమర్పించి అమిత సంతోష పరచిన
హనుమ సేవా తత్పరతకు ధీఠుగా
నిలచిన పవిత్ర పర్వతప్రాంతము.
ఒకానొక కాలములో పంపా నది
నీరు అపరిశుద్ధమై పాన యోగము లేని
స్థితిలో ఉండగా అచట వశించు
మునులు శ్రీరామునికి తెలుపగా ఆ నీటిని
తన కరములతో స్పృశించి
పరిశుద్ధము గావించెను.
హేమకుంట
పర్వతముపై శివుడు మన్మధుని తన
మూడవ నేత్రముతో భస్మము చేసిన సంఘఠన
వలన శివునికి "విరూపాక్షుడు" రౌద్ర కన్నులు కల
వానిగా పేరు సార్ధకమైనది. ఇచట
విజయనగర శైలిలో నిర్మింపబడిన అతి
సుందర శివాలయము నిర్మితమై పరమేశ్వరుని
"విరూపాక్షేశ్వర” రూపములో
అశేష భక్తుల కోరికలను తీర్చు
కరుణామయుడుగా హంపీ క్షేత్రములో వెలసెను.
శ్రీరాముడు
వాలిని వధించిన ప్రాంతము "నింబపుర"
అను గ్రామములో నేటికీ కొండ ఎత్తున
ఆతని చితాభస్మము రూపములో తార్కాణముగా ఉన్నది.
పంపా నదికి పార్వతీదేవి పేరు
సార్ధకమై ఉన్నది కావున ఈ
ప్రాంతము "పార్వతీక్షేత్రము" గా వాశికెక్కినది.
అంజన గిరి హనుమ జన్మ
స్థానముగా నెలకొని ఉన్న ప్రాంతము
సుదీర తీరముల వరకు క్రూర
మృగములతో శిఖర ఆరోహణకు అసాధ్య
రీటిగా గావించబడినది.
రామసేతు
నిర్మాణములో ఉపయోగించిన శిలలు (పోరస్ రాక్స్)
హంపీ వద్ద లభ్యమైన శిలలు
ఒకటే కావడము గమనార్హము.
విజయనగర
సామ్రాజ్య సంస్థాపకుడైన విద్యారణ్య స్వామికి కలలో లక్ష్మీదేవి
సాక్షాత్కరించి కోరిక తెలుపు మనగా
ఆతను సువర్ణ వర్షము కురిపించమనెను.
తక్షణము ఆతని కోరిక ఈడేర్చుటకు
ఒక గంట పదిహేను
నిముషములు సమయము సువర్ణ వర్షము
కురియగా 1336 లో దేవాలయము నిర్మించి
ఆమె సువర్ణ ప్రతిమను తీర్చి
దిద్దెను. ఈ కాల్పనిక
జగతిలో ఇది సాధ్యమా? అని
దైవ శక్తిని ఎప్పుడూ తక్కువ
అంచనా వేయవద్దు. ఇవన్నీ భక్తితో కూడిన
సంప్రదాయ నమ్మకములు. కావున దైవ శక్తి
ఎప్పుడూ మన అంచనాలకు అందని
ఎత్తులోనే ఉంటుంది.
మాతంగ మహర్షి తపమాచరించిన పవిత్రప్రాంతము. పంపా
తీరములో వెలకొన్న సీతా రామ
లక్ష్మణ మూర్తులు ఒకే శిలపై
ఆవిష్కరింప చేసిరి. పురందరదాసు నారదుని
ద్వారా భక్తి తత్వములను ఆస్వాదింప
చేసుకొనిన పుణ్య ప్రదేశము.
మహాభారతములో
ధర్మరాజు రాజసుయాగము చేసి అనంతరము సహదేవుని
దక్షిణ దిక్కుగా పంపెను. కిష్కిందలో
ఏడు రోజులు యుద్ధమాచరించి పాలకుడైన
పాండ్యరాజు "పులిందాస్" వద్ద కప్పములను స్వీకరించెను.
అనేక అతిధి సత్కారములను పొందెను.
ఆ సమయములో వారు
విలువైన ఆభరణములు కానుకలుగా సమర్పించి
పాండవులపై తమకుగల భక్తి భావములను
వ్యక్తీకరింప చేసుకొనిరి. సుపరిపాలకుడైన నీలరాజుతో యుద్ధమొనరించి మహిష్మతీ రాజ్యమును గెలుపొందెను.
ఎన్నో మరెన్నో ఇతిహాసిక, చారిత్రాత్మక,
పురాణసంఘఠనలకు తార్కాణముగా నిలచి ఉన్నది మాల్యపర్వతము
అని నేనంటాను.మరి మీరేమంటారు?