Wednesday, 13 November 2019

ప్రపంచ దేశములలో వెలసిన శివలింగములు వాని వైశిష్ఠతలు


ఆకాశే తారక లింగం - మర్త్యలోకే మహాకాళం - పాతాళే హఠకేశ్వరం లింగత్రయ నమోస్తుతే" అని త్రిలింగేశ్వరుని ప్రస్తుతించుట ఒక ప్రముఖ ప్రక్రియ. కాలమైనా, యుగమైనా, సృష్టి ప్రారంభ కాలము నుంచి ఈశ్వర ఆరాధనలు ప్రపంచ వ్యాప్తముగా జరిగినవి.



అంతరిక్షములో తారకలింగ రూపములో మానవ లోకములో "మహాకాళం" (కాలగణనానికి అందనిది) పాతాళ లోకములో "హఠకేశ్వరుడు" గా వెలసి ఉన్న శివుని రూపము అణువు నుంచి బ్రహ్మాండము వరకు వ్యాపించి ఉన్నది. ఇదే రూపము "కాస్మిక్ ఎగ్" అని నవీన శాస్త్రజ్ఞులు తెలిపిరి.

వేద కాలములో శివుని "రుద్రుడు" అను పేరుతో ఆరాధించుట ఒక విశేషముకాలచక్ర గమనములో శివుని "పరబ్రహ్మ, పరమశివుడు" అను పేరులతో విశేష రీతిలో ఆరాధించుట మరియొక విశేషముపురాణ కాలములో శివుడు "మహేశ్వరుడు" గా వ్యవహరింపబడి నిత్య పూజలందుకొనెనుతరువాత కాలములో శివుడు "మహాదేవుడు" అను పేరుతో ఆరాధింపబడటము సర్వదా ఆమోదకరమైనది.

ఈశ్వరుని "త్రినేత్రునిగా" అబివర్ణించుటకు కారణము ఒక నేత్రం "సూర్య నేత్రం" రెండవది "చంద్ర నేత్రం" మూడవది భ్రూమధ్య స్థానములో నెలకొనిఉన్నది "అగ్నినేత్రం". నేత్రానికి దహన శక్తి మరియు సంజీవని శక్తి ఉన్నాయి. పృధ్విపై జీవ చరములకు లేని రీతిలో మూడు నేత్రములు పరమశివుడు కలిగి ఉన్నందున "త్రినేత్రుడు" గా అభివర్ణించడమైనది. ఇంత మహిమోపేతుడు, శక్తిమంతుడు, వరప్రదాత అయిన శివునికి ప్రపంచ వ్యాప్తముగా వివిధ నామములతో, వివిధ రీతులలో వివిధ ప్రాంతములలో నిత్యాభిషిక్తుడై, నిత్య పూజలను అందుకొనిన వైనములు అతి క్లుప్త రీతిలో వివరించడమే వ్యాస ముఖ్యోద్దేశ్యము.

నేడు కలి యుగములో ప్రముఖ మతములుగా అలరారుతున్న క్రైస్తవ మరియు ఇస్లామిక్ మత ప్రవక్తల అనుభవసారములు అతి సామాన్య రీతిలో వ్యాసమహర్షి ద్వారా "భవిష్య పురాణములో" సుమారు 3100 బి.సి లో వివరించబడినవి. జీసస్ పుట్టుక భవిష్య పురాణంలో విధముగానున్నది.


"ఈశపుత్రంచ మాంవిద్ది
కుమారీగర్భ సంభవం
మ్లేఛ్ఛ ధర్మస్య వక్తారం"

కలియుగము ప్రారంభమైన 3100 బి.సిల తదనంతరం జీసస్ మ్లేఛ్ఛ దేశములో జన్మించెను. ఆతను హిమాలయ పర్వతములలో తపస్సు చేసి సిద్ధ పురుషుల ఆశీస్సులతో కొన్ని శక్తులను పొందెనని వ్యాసుడు తెలిపెను. మరియు మ్లేఛ్ఛ దేశములలో ధర్మము వ్యాప్తి చేయుటకు కుమారి గర్భమున ఒక మహా పురుషుడు ఈశపుత్రునిగా అవనిపై అవతరించునని వ్యాసుడు భవిష్య పురాణములో విశదీకరించెను.

భారత దేశములో హిమాలయ పర్వత ప్రాంతములలో అవంతికా దేశ పరిపాలకుడైన శాలివాహన చక్రవర్తికి ప్రప్రధమముగా శ్వేత వస్త్రధారుడై ఉన్న జీసస్ యొక్క దర్శనము సంప్రాప్తమైనది. ఆతని లోని తేజస్సును కని ఆశ్చర్య చకితుడాయెను. ఆతని పరిచయము కొరకు ముందుకు సాగి అభివాదము చేసి వివరములను ప్రశ్నించెను. జీసస్ మృదు స్వరముతో తాను ఈశపుత్రునని తెలిపి వ్యవహారిక నామము "ఏసు" అని తాను పశ్చిమ దేశవాసునిగా తనని తాను పరిచయము చేసికొనెను.

భారత దేశమునకు తన రాకకు కారణములను తెలుపుతూ పశ్చిమ దేశములలో నివశించు జనులకు సత్యము, ధర్మము, స్వచ్చతల యొక్క ప్రాధాన్యతలను బోధన చేయుటకు మరియు పాపపంకిలమై ఉన్న జగతిని సంరక్షించుట కొరకు వారిని బాహ్య అంతఃశుద్ధులను గావించుటకు తగు మార్గములను అతి సామాన్య రీతిలో ఉపదేశించుటయే తన ముఖ్య కర్తవ్యముగా భావించితినని, అందులకు ఆలంబనము "భారత దేశమే" అని, తనకు ప్రాంతములో వశించు ఋషులను, మునులను, యోగులను కలిసి సంభాషించుటకు అనుమతినీడమని కోరెను. శాలివాహన చక్రవర్తి మహా పురుషునికి అభివాదము చేసి అతనికి భారత దేశముపై గల గౌరవాభిమానములకు మిక్కిలి సంతసించి సంతృప్తితో అనుమతినీడెను.

తరువాత కాలములో ఎన్నో విద్యలను ఋషుల వద్ద నేర్చుకొని అత్యున్నత ప్రావీణ్యతను సంపాదించిన జీసస్ అంధులకు చూపును, మూగవారికి మాటలాడు శక్తిని, కుంటి వారికి నడచుటకు శక్తిని, హిమాలయ వృక్ష మూలికల నుండి లభ్యమౌ అనేక పదార్ధముల నుండి ఆయుర్వేద విద్యను అభ్యసించి అనేక రోగముల నుండి తన దేశవాసులను సంరక్షించెను. ఈశపుత్రునిగా ఇలపై అవతరించిన మహోన్నత వ్యక్తి గా క్రైస్తవమత సంస్థాపకునిగా పేరొందెను. నేడు ప్రపంచములో ఎన్నో దేశములు "క్రైస్తవమతం" అనుసరించుటకు కారణము "జీసస్" కావడము ఒక విశేషమైతే ఒక మహోన్నత మత సంస్థాపకుడై మరియు ఒక మత ప్రవక్తగా  ఇలపై అవతరించి మన మధ్య మసలిన అతి సామాన్య మానవుడు.

ఇలపై వెలసిన మరియొక గొప్ప మతము "ఇస్లామిక్ గాపేరొందినది. ప్రపంచ దేశములన్నీ వ్యాపారమును అభివృద్ధి పరచుటకు తిరిగిన మహిమాత్ముడు "మహమ్మద్ ప్రాఫిట్" తన అనుభవాల సారములతో "ఇస్లాం మతమును" సంస్థాపించెను. ఈతని పయనములో ఒక అధ్భుత సంఘఠన నేడు ఇస్లామిక్ మత పవిత్ర క్షేత్రములుగా విరాజిల్లుతున్న "మక్కా, మదీనాలలోజరిగినది. ఒకానొక సమయములో మహమ్మద్ ప్రాఫిట్ తన అనుచరులతో పయనించు సమయములో ఒక జ్వాలా లింగం ఆతనిని అనుసరించుతూ ఎంతో దూరము వెనుక రాగా ఆందోళనతో పరుగు తీయగా అలసి సొలసి  చివరకు "మక్కా నగరము" సమీపించగా అచట ఆగ్నిలింగము నిలచిపోయెను. ఇది భగవదేచ్చగా భావించి  తదనంతరము అచ్చోట వెలసిన శివలింగము "మక్కేశ్వరునిగా" రూపొందెను. జ్వలించుతూ నెలకొన్న ఈశ్వరుని "జం-జం బావిలో" నిక్షేపితము చేసిరి. నేటికీ మక్కేశ్వరుడు బావిలో గంగా జలముల నడుమ నిత్యాభిషిక్తుడై చల్లదనమును ఆపాదించుకొని జ్యోతిర్లింగ రూపములో భక్తులను తన కృపాకటాక్షములతో వీక్షించుట అనునది ఒక పురాణ సంఘఠన మరియు విశ్లేషణ.




"మక్కానగరము" ఇస్లామిక్ మతస్థులకు పుణ్యక్షేత్రము. పవిత్రనగరము. ఈశ్వరుడు "మక్కేశ్వరునిగాఅగ్నిలింగ రూపములో నగర పేరును తన పేరుతో తీర్చి దిద్దుకొనుట ఒక విశేషమైతే "జంజం" బావిలో కనులకు కానరాని రూపములో నేటికీ నిక్షిప్తమై ఉండుట మరియొక విశేషము.

భగవంతుని మహిమలు మతమైనా, జాతి అయినా, కులమైనా, భాష అయినా, పేరు అయినా భేధములు లేక సదా భక్తకోటిని కాపాడుట అనునది విశ్వసనీయత. అందువలన ప్రపంచ దేశములలో ఎన్నో ప్రాంతములలో మత విభేధములు లేని సర్వేశ్వరుని ఆరాధన నేటికీ ప్రాచుర్యములో ఉన్నది అని తెలుపుటకు లభ్యమైన కొన్ని వివరములు.

భారతదేశములో వెలసిన శివలింగములు:-

కాశీ విశ్వేశ్వరలింగ ఆవిర్భావము:-

ప్రళయ కాలములో ప్రకృతి అంతా జలమయమైనప్పుడు సృష్టి ప్రారంభము కొరకు  బ్రహ్మ, మహా విష్ణువులు పరమశివుని ప్రార్ధించగా అతను సంతుష్టుడై తన త్రిశూలముపై పంచకోశ పరిమాణముగల కాశీ నగరాన్ని నిలుపగా అచట నుండి బ్రహ్మ తన సృష్టి రచన చేసెను. తదనంతరము ఈశ్వరుని రూపు అణువు నుంచి బ్రహ్మాండము వరకు విశ్వమంతా వ్యాప్తీకరించి ఉండుట వలన "విశ్వేశ్వరునిగా"  నాటి  నుంచి నేటి వరకు పవిత్ర గంగా నదీతీరమున వెలసిన మహిమోన్నతుడు. నిత్యాభిషేకములతో, అశేష భక్తకోటి పూజలను అందుకొని వారిని సదా రక్షించుట ఒక అధ్భుతమే.

భూదేవికి నాభిగా పేర్కొనబడిన  మధ్యప్రదేశ్ లోఅవంతికా నగరములో వెలసిన "మహాకాళేశ్వర లింగము" కాలగణనమునకు అంతు తెలియక నేటికీ నిత్య పూజలతో అలరారుతున్నది.

"ఓం సౌరాష్ట్రే సోమనాధం - శ్రీశైలే మల్లికార్జునం
ఉజ్జయినీం మహాకాళం - ఓంకార అమరేశ్వరం
ప్రజ్వలాం వైద్యనాధం - డాకిన్యాం భీమశంకరం
సేతుభంధేతు రామేశ్వరం - నాగేశం దారుకావనే
వారణాశ్యంతు విశ్వేశ్వరం - త్రయంబకే గౌతమీతటే
హిమాలయేతు కేదారం - ఘృష్టేశం విశాలకే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతఃపఠేన్నరః
సప్తజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి"

ఇవికాక భారత దేశములో అన్ని దిశలలో అతులిత మహిమలతో, నిత్య పూజలతో అలరారుతున్న కొన్ని కోట్ల శివలింగములు వ్యాప్తీకరించి ఉన్నవి (శ్రీ రమణ మహర్షి ద్వారా విరచితమైన "శివుడే దేవాధిదేవుడు, ఆదిదేవుడు, పరమ పురుషుడు అను నిత్య పారాయణ గ్రంధము ద్వారా ప్రపంపచములో వెలసిన కొన్ని శివలింగముల వివరములు).

1.రోం నగరములో క్రీ. పూ. "ప్రియేషస్" అను పేరుతో శివలింగ ఆరాధన జరిగినది.

2.ఇజ్రాయిల్ లో క్రీ.పూ "బెల్ ఫెగో" అను నామముతో ఈశ్వర ఆరాధనలు వైభవోపేతముగా  జరిగినవి.

3.అరబ్ దేశములో క్రీ. పూ. నుంచి "లాల్" అను పేరుతో శివలింగ పూజలు విశేషముగా జరిగిన  సంగతి ఒక విశేషమే.

4.ఎడారి దేశముగా పేరొందిన ఈజిప్ట్ దేశములో క్రీ.పూ. నుంచి  "ఒనిరెస్" అను పేరుతో వృషభేశ్వరుని మారేడు దళములతో శివలింగమును నేటికీ భక్తి తత్పరతలతో పూజిస్తారు.

5.టర్కీ దేశములో క్రీ.పూ. నిర్మితమైన వంద అడుగుల శివలింగం విశేష పూజలతో నేటికీ ఆరాధింపబడుటము విశేషము.

6.స్కాట్ల్యాండ్ లో శివలింగం నేటికీ సువర్ణఖచితమై మెరిసి పడుతూ క్రీ.పూ, నుంచి నేటి వరకు విశేష రీతిలో పూజలు అందుకొనడము అధ్భుతమే.

7.గ్రీక్ దేశములో క్రీ.పూ. శివారాధన "అపోలో పాపిదాస్ భులాస్" అను పేరుతో చేసిన శివారాధనలు చరిత్రలో వైభవోపేతమే.

8.జపాన్ దేశములో క్రీ.పూ. నుంచి "హవేజ్ వాసత్" అను పేరుతో శివునికి నేటికి విశేష పూజలు జరుపబడుతున్నవి.

9.యునన్ దేశములో క్రీ. పూ. "ఫల్గుస్" అను పేరుతో వెలసిన శివలింగం నేటికీ ఉన్నది.

10.ఇరాన్ ఇస్లామిక్ మత దేశమే అయినా ఇచట ప్రాచీన కాలము నాటి రాజుల పరిపాలనలో లభ్యమైన నాణెముల మీద త్రిశూలధారి అయిన శివుని రూపము ముద్రించబడినది.

11.మాస్కొ దేశములో "భద్రేశ్వరుడుఅను పేరుతో వెలశిన శివలింగం అశేష పూజలు అందు కొను వైనము శుభ సంకేతమే.

12.ఉత్తర అమెరికాఖండ వాసులుఫెరూలియా" నగరములో 1200 అడుగుల ఎత్తులో శివలింగమును ప్రతిష్ఠాపించిరి. ఇది ప్రపంచములోనే సుప్రశిద్ధ దేవాలయముగా కీర్తించబడటము వింతయే.

13.దక్షిణ అమెరికాఖంఢములో క్రీ. పూ. బ్రెజిల్ సమీపములో ఎన్నో ద్వీపములలో లభ్యమైన అనేక శివలింగములు వన్నె మాసినా మహిమ తగ్గక అలరారుట అనునది చారిత్రాత్మిక విశ్లేషణమే.

14.రోము నగర సామ్రాజ్యము క్రైస్తవ క్షేత్రమైన "వాటికన్ సిటి" మ్యూజియంలో "ఇట్రూరియా" అను పేరుతో ప్రఖ్యాతి చెందిన శివలింగము నేటికీ ఉన్నది. శివలింగం ఇటలీ ప్రాంత పురాతన వాస్తు పరిశోధనలలో భూమిని త్రవ్వగా వెలుగులోనికి వచ్చినది.

15.పాలస్తీనాలో వాటికన్ సిటీ సమీపములో అనేక శివలింగములు లభ్యము కావడము అచట శివారాధనలు ప్రాచుర్యములో ఉన్నవి అనుటకు కొన్ని ఆరాధనలతో, మరికొన్ని ఆరాధనలు లేనివిగా నేటికీ నిలచి ఉండుట విశేషమే.

16.ఐరోపా ఖండములో "కారిస్థ్" నగరములో శివారాధన సర్వజన ఆమోదయొగ్యమై నేటికీ ప్రాచుర్యములో ఉన్నది. ఇది ఒక క్రైస్తవ క్షేత్ర ప్రాంతముగా వాసికెక్కినది.

17.ఫిజియన్ దేశవాశులు "విటిస్" అను పేరుతో వెలసిన శివలింగము ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించు కొన్నదిగా శివలింగ రూపమునకు చేసే ఆరాధనలు విశేష రీతులలో ప్రస్తుతింపబడినవి.

18.సింగపూర్లో "పోతోంగ్ పసిర్" అను పేరుతో శివుని ఆరాధించుట ఒక వింతయే.

19.కాబూల్, కాందహార్, బులక్, బుఖారా, ఆఫ్ఘనిస్తాన్లలో చాలా పురాతనమైన శివలింగములు "పంచషేర్" మరియు "పంచనార్" అను పేరులతో ఆరాధింపబడుట జగద్విదితమే.

మక్కానగర క్షేత్రము ఇస్లాం మతస్థులకు పుణ్య క్షేత్రము మరియు పవిత్ర నగరము. ఈశ్వరుడు "మక్కేశ్వరుడను" పేరుతో జ్వాలాలింగ రూపములో వెలసి నగర పేరును తన పేరుతో తీర్చి దిద్దుకొనుట ఒక విశేషమైతే "జం జం" బావిలో కనులకు కానరాని రూపములో శివలింగము నేటికీ నిక్షిప్తమై ఉండుట మరియొక విశేషము.

ఫ్రెంచ్ రాజధాని నగరమైన "అనాం" క్రైస్తవమత క్షేత్రముగా  వాశికెక్కినది. ఇచట నిర్మితమైన శివాలయములలో శివలింగ పూజలు  వైభవోపేతముగా నిర్వహించబడటము విశేషము మరియు ఇచట శివాలయములను "చంపా" అను పేరుతో వ్యవహరిస్తారు.

అఖండ సృష్టిని ఒకటిగా తలపింపచేయు ముఖ్యోద్దేశ్యముతో "పంచభూతముల" సమ్మిళితముగా ఏర్పడిన మంత్రము శివ పంచాక్షరీ మంత్రము "ఓం నమశివాయ"

ఓం- ప్రణవనాదం
-అవని
-జలం
శి-అగ్ని
వా-వాయువు
-ఆకాశమునకు ప్రతీకగా నిలచినవి. మరియు అతి ముఖ్యమైన పంచ గుణములైన ధ్యానం, దైవభక్తి, ధాతృత్వము, సత్యము, సంతోషములతో మిళితమై మానవజాతిని ప్రభవింపచేయు శివశక్తి అపారము అగణితము.

ఓం - "అకార" "ఉకార" "మకారములతోరూపు దిద్దుకొన్న "ఓంకారేశ్వరునిగానభూతో నభవిష్యతి లా వెలుగులీనుతూ మహాకాలునిగా కాల గణనమునకు అందని రీతిలో శివ జ్ఞాన తత్త్వమే సర్వ సృష్టికి ఆధారము కాగా వాయువులా విశ్వమంతా వ్యాపించిన విశ్వేశ్వరునిగా యజ్ఞ యాగ మంత్రాభిషేకములతో మంగళకరమైన అర్ధనారీశ్వర రూపముతో అన్యోన్నతకు మారు పేరుగా నిలచిన ఆది దంపతులకు ప్రకృతి పురుషులు ఇచ్చే నీరాజనములను అందుకొని




ఓంశభ్ధములో ప్రణవనాదంలో ప్రతిధ్వనించి
శభ్ధములో నాదంగామారి
శభ్ధములో మంత్రములో ఆవిష్కరింపబడి
శిశభ్ధములో స్తుతించబడి
వాశభ్ధములో తేజంలా ప్రకాశించి
కారములో యజ్ఞములో యజ్ఞ ఫలమందుకొని "ఓం నమశివాయః" అను పంచాక్షరీ మంత్ర నినాదములతో సర్వలోకములను పునీత పరచి అశేష భక్తులపై తమ అశేష దీవనలను కురిపించే పార్వతీ పరమేశ్వరులను జగతికే జననీ జనకులుగా అభివర్ణించుట యుగానికైనా ఆదర్సమే మరియు జగమెరిగిన సత్యమే అవుతుంది అని నేనంటాను. మరి మీరేమంటారు?