Thursday, 12 October 2017

అహింసయే పరమధర్మం : రెండవ భాగం


పూర్వాకాలంలో బయటకు వెళ్ళేవారిని పెద్దలు ఆశీర్వాదాలిచ్చి, క్షేమంగా వెళ్ళి లాభంగా రా: అని దీవించి పంపేవారు. అది ఒకరకమైన బలాన్ని, ధైర్యాన్ని నేడు ఆధునికత పెరిగిన మనస్సులకి అలవాటు చాదస్తంగానే మిగిలిపోయింది. ప్రస్తుతకాలంలో వ్వ్ దీవన చాలా అవసరం అనిపిస్తోంది. నవనాగరిక ప్రపంచంలో ముఖ్యంగా నగరాల్లో వాహనాల రద్దీ ఎంత ఎక్కువగా పెరుగుతున్న కొలది ప్రజలక్షేమం అంత మృగ్యం అవుతున్నది. బయటకు వెళ్ళినవారు ఇంటికి క్షేమంగా వచ్చేవరకు ఆందోళనే. మితిమీరిన వేగం అదుపులో లేని వ్యసనాలు, అలవాట్లు ముఖ్యకారణాలుగా కనిపిస్తున్నయి. ఏది మితిమీరినా వారిలోని మంచితనం కనుమరుగవుతోంది. మత్తులో అపఘాతాలు చెయ్యటం వాహనప్రమాదాలు జరపటం ఒకరకమైన హింసాత్మక తత్త్వమే. కనీసం వాహనం నడిపేటపుడు అలవాట్లు నుంచి దూరం కావటం సర్వశ్రేయస్కరం. ఇది అందరికీ తెలిసిన నిజం. అయినా మధ్యం మత్తుకి అలవాటుపడిన మనస్సు, శరీరం మనమాటలకి విలువ ఇవ్వవు కదాదీనివలన అనేకమంది అమాయకులు విగతజీవులుగా మారుతున్నరు. హింసాత్మక ఘటనకి కారణం మధ్యం సేవించి వాహనం నడపటం. వాహనాలు నడిపేటపుదు అలవటు వలన విచక్షణా జ్ఞానం నసించి ఆవేశధాటికి అదుపుతప్పి ప్రమాదాలు సంభవిస్తాయి. అదే సమయంలో మృత్యువు తనకోరలు చాచి అనేకమంది నిండు ప్రాణాలు బలిగొంటుంది. దీనివలన ముప్పు మీ ప్రాణాలకే కాదు. మీతో ప్రయణం చేస్తున్న అందరికీ వర్తిస్తుంది. తర్వాత ఎంత విచారించినా లాభం శూన్యమే. కాబట్టి మద్యం త్రాగి వాహనాన్ని నడిపే అలవాటు నుండి బయటకు రండి.

కొన్ని సంధర్భాల్లో అధికవేగం, అధిక నమ్మకంతో ముందు, వెనుక వచ్చే వాహనాలు చూడకుండా వాటిని అధిగమించాలనే ఒందరపాటుతో చేసే ప్రయత్నాలు కూడా ప్రమాదాలకి కారణభూతమవుతున్నాయి. వాహనం నడుపుతూ మోబైల్ వాడకం కొంతవరకుమీ దృష్టిపథాన్ని ప్రక్కదారులకు మళ్ళిస్తుంది. ఇవన్నీ హానికరాలే. సమయంలో మీకు తెలియకుండానే మీరు నడిపే వాహనం మీ అదుపు తప్పుతుంది. కావున సాధ్యమైనంతవరకు అలవాటు నుంచి దూరంగా వుండడం మంచిది. అంత అవసరమైన విషయమే అయితే వాహనాన్ని ప్రక్కకు తీసుకువెళ్ళి నిలిపు మీ మాటలు ముగించడి. దానివలన ఎవరి ప్రాణానికి నష్టం వాటిల్లదు. అలవాటు పెద్దవాహనాల మొదలు బైక్లు నడిపేవారి వరకు అందరిలో చూస్తున్నము. ఇవే అధిక అభధ్రతాపరిణామాలకి దారితీసే సంఘటనలు.

మీ వాహనం ఎటువంటిదైనా కనీసం నడిపేటపుడు సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుని గుర్తు చేసుకొండి. మిమ్మల్ని అతని స్థానంలో ఊహించుకోండి. అర్జునునికి రధసారధియై మహాభారత రధ యుద్ధాన్ని నడిపించదమేకాక సమయోచితంగా అతని ప్రాణాల్ని నిలిపి ధీరత్వాన్ని ఆపాదించడం జరిగింది. ఇది కదా విజయసంకేతమంటే.

ప్రస్తుతకాలంలో మీ వాహనాల్లో ఆధునీకరణ చేయబడిన పరికరాలెన్నో అమర్చబడి వున్నాయి. ఉల్లసమైన సంగీతం వినటం, అలసట అనిపిస్తే చల్లని నీరు త్రాగటం లాంటివి చేస్తూ మనస్సుకి ఉత్సాహాన్ని కలిగించేలా వాహనాన్ని నడుపుతూ ప్రయాణాన్ని సాగిస్తే ఎంతో ఆనందంగా, సాఫీగా సురక్షితంగా గమ్యం చేరతారు.

ప్రమాదాలు అరికట్టాలంటే ముఖ్యంగా ప్రభుత్వ రక్షణాధికారులను తగుస్థానాల్లో నియమించాలి. ఎక్కడికక్కడ సి.సి.టి.వి కెమేరాల్లో నిక్షిప్తమైన సమాచారంలో వారి అకృతచర్యలకు అడ్డుకట్ట వెయ్యలి.శిక్ష అతికథినంగా లైసెన్స్ కేన్సిల్ చేస్తారన్నంత భయంతో వుండాలి. అవసరమైతే చెయ్యలికూడా. అపుడే అపఘాతాలు కొంతవరకు అరికట్టబడతాయి. రోడ్డుమీద నడిచేవారు తగుజాగరూకతతో సిగ్నల్ చూసి దానికి అనుగుణంగా దాటటానికి ప్రయత్నించాలి. అవి లేకపోతే వాహనాలు  వచ్చేదారి గమనిస్త్తు నిదానంగా దాటాలి. దీనికి నడిపేవార్ సహకారం నడిచేవారి సహకారం రెండూ కావాలి. ఇదే సురక్షిత ప్రాయాణానికి నాందీ అవుతుంది. రక్షణ సిబ్బంది కూడా ఎటువంటి ధనప్రలోభాలకి లొంగకుండా కథినంగా వుంటే డబ్బుతో వారిని కొనలేము అన్న నిజం ముందు తలవంచుతారు. న్యాయపరిధిలో కూడా సిక్ష కథినంగా వుంటే హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవు. ఇది జరిగిన నాడు వాహనం నడిపేవారు తమ ప్రాణాలే కాదు తమతో ప్రయాణం చేసేవారి ప్రాణాలను కూడా కాపాడినవారవుతారు. అందుకు కృతజ్ఞతగా మనందరం సురక్షితంగా గమ్యం చేర్చిన వారిని 'ప్రాణదాత సుఖీభవా అందాము.

'నస్త్రీ స్వాతంత్ర్యమర్హతీ అన్న నుడికారానికి అర్ధం పూర్తిగా మారిపోయిన రోజులివి. మితిమీరిన స్వాతంత్ర్యమర్హతీ అన్న నుడికారానికి అర్ధం పూర్తిగా మారిపొయిన రోజులివి. మితిమీరిన స్వాతంత్ర్యం స్త్రీల విషయంలో అనేక అనర్ధాలకి దారితీతోంది. కాలంలో ఒకప్పుడు స్త్రీయవ్వనం వచ్చేవరకు తల్లిదందుల రక్షనతో, వివాహనంతరం భర్తరక్షనతో వృద్ధాప్యంలో పిల్లలరక్షనతో కాలం గడిపేది. కానీ నేడు విద్యావంతురాలైన స్త్రీ వీటి రక్షన లేకుండా బ్రతుకలేనా? అని అలోచిస్తోంది. వాదన చేస్తోంది. నిజమే బ్రతకవచ్చు. కానీ బ్రతుక్కి పరమార్ధం వుండదు. స్వభ్హావసిద్ధంగా స్త్రీమనస్సు అతికోమలంగా సున్నితంగా వుంటుంది. తాను ఎంచుకొన్న జీవనవిధానం అందుకు భిన్నంగా వుంటే జీవితమంతా ఏటికి ఎదురీదడమే అవుతుంది. సమాజంలో ఎదురయ్యే సమస్యలతో బ్రతుకంతా ఈదుతునా గమ్యం చేరటం కష్టతరమే అవుతుంది.

నేటికాలంలో మహిళలపై జరిగే అత్యాచారాలు చిన్నపెద్ద తారతమ్యం లేక అతిమదంతో రెచ్చిపొయే రౌడీమూకలు ఎక్కువై సమాజానికి చీడపురుగుల్ల తయారవుతున్నరు. విజృంభణలు జరగడానికి కారణాలు వెతికి తప్పులు మగవారివా : లేక ఆడవారివా అన్న వాగ్వాదాలు సమస్యల్ని పరిష్కరించవు. వివాదాలు ఎప్పుడూ సమస్యల్ని జటిలం చేస్తాయే తప్ప సుగమమైన మార్గాన్ని చూపించవు.

నేడు విద్యావంతులైన ఆడవారు మగవారితో సరిసమానంగా సంపాదనాపరులవుతున్నారు. స్త్రీ విద్య అభివృద్ధి చేయడానికి ఈవినింగ్ కాలేజీలు, డిస్టింక్ట్ ఎడ్యుకేషన్ సంస్థలు, వయోవిద్యా కేంద్రాలు, ఆన్లైన్ కోర్సులు ఎన్నో వెలిసాయి. మనిషిలోని విద్య అభివృద్ధి అయినదే కానీ వివేకం పెరగలేదు. ఎక్కడవిన్న మహిళలకి తగినంత రక్షణ లేదు అన్నమాటే వినిపిస్తున్నది. దీనికి కారణాలు అనేకం. వాటిలో విద్యావంతులైన ఆడ, మగ విచక్షణ లేక విచ్చలవిడిగా తిరగడం, మధ్యాఇకి బానిసలవటం, డ్రగ్స్ వాడకాలు మితిమీరడం, ఆధునిక వస్త్రధారణ, వేళపాళ లేని విహారాలు సినిమాల ప్రభావం, మాటలతో రెచ్చగొట్టే తత్త్వాలు, అదుపులోలేని ఆవేశాలు, సంపాదనలో స్వతంత్రత, వీధివీధికి వెలసిన పబ్ల్లో చేసే అసభ్యకర నృత్యాలు వగైరాలు కారణభూతమవుతునాయి. దారుణాలు జరగడానికి దారితీస్తున్నయి. ఎన్నోమరెన్నో కారణాలు ఉన్న ఈపైన ఉదహరించినవి నగర వాతావరణంలో కనబడేవి. కొన్ని అభివృద్ధి చెందీ చెందని పట్టణాల్లో గ్రామాల్లో దారుణాలు జరగడానికి కారణాలు నిరక్షరాస్యత, స్నేహితుల ప్రభావం, ఏమాత్రం అనుకూలత లేని గృహవాతావరణాలు, పైశాచికంగా మహమ్మరిలా విజృంభించిన మత్తుమందుల దాసోహం అవటం, ఎంత చదివినా ప్రోత్సాహం లేని ఉద్యోగ అవకాశాలు ముఖ్యమనిపిస్తున్నయి.

నేడు యువతకే కాదు ప్రజల్ని అన్ని వర్గాలవారికి సరైన అవగాహన కపించగలగాలి. జాగరూకత వచ్చిన నాడు చర్యలు కొంతవరకు అరికట్టబడతాయి. మహిళలు కూడా తమని తాము రక్షించుకునే స్థాయిని ఎదగాలి. కోర్టుకి వెళితే న్యాయస్థానంలో ఏళ్ళతరబడి కాలంగడిచినా సిక్షలు అమలుజరగవు అన్న అభిప్రాయం మారాలి. కనీసం ఇటువంటి కేసుల్లో పట్టుబడిన వారికి తక్షణమే కథినసిక్ష విధిస్తే కొంతవరకు పరిస్థితి మెరుగుపడవచ్చు. ఇంకా మనుషుల్లో మానవత్త్వం మిగిలివుంటే అటువంటి అభాగినులకు చేయూతనిచ్చి జీవనసహచారిణిగా దరిచేర్చుకొని తగిన రక్షణ కల్పించగలిగితే, తీర్పు న్యాయపరంగా లభిస్తే కొంత ఊరట లభిస్తుంది. మహిళలు తమని తాము రక్షించుకోగలగాలి. ఒంటరిగా రహదారుల్లో తిరగడం వాహనాల్లో ఒంటరి ప్రయాణం నాకేం అన్నట్టు ధీమాగా వుండటం మాని కాలానికి అనుగుణంగా నడవటం నేర్చుకోవాలి. ప్రతీ మనిషి తమ జీవితమనే అదృష్టచిత్రాన్ని ఎవరికి వారే తీర్చిదిద్దుకోవాలి. అందులో తమ అదృష్టాన్ని వెతుక్కోవాలి. ప్రకృతి తన స్వభావసిద్ధమైన నిఘంటువు సమాజంలో స్త్రీతో సరిసమానంగా ప్రతీపురుషునికీ కూడా విధించింది అన్న సత్యాన్ని గ్రహించిన్నాడు ఈలోకం స్వర్గతుల్యమవుతుంది. "ఏనాడు ఒకస్త్రీ అర్ధరాత్రి సురక్షితంగా తన ఇంటికి చేరగలదో ఆనాడే మనకు నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు" అన్న గాంధీగారి మాటల్లోని సత్యం దూరం కాకూడదు.

                                               "ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో
                                                     అక్కడ దేవతలు నివశిస్తారు."

అన్న లోకోక్తి నిజమే కదా! దీన్ని మనందరం కలిసి నిజం చేద్దం. ఇది నామాటే కాదు మనందరి మాట అవుతుందని ఆశిస్తూ దేవతల ఆశీర్వచనాలకై తలవంచి శతకోటి నమస్కారాలు చేద్దామంటాను.

నేరెళ్ళ రాజకమల.