భారత
రాజ్యాంగ విధానంలో నాయకులు ప్రజలచే
ఎన్నుకొనబడటం వలన ‘ప్రజాస్వామ్య’ (డెమొక్రటిక్)
రాజ్యముగా విఖ్యాతి చెందింది. ప్రజల
ద్వారా అత్యధిక సంఖ్యతో ఎన్నిక
అయిన పార్టీ ద్వారా
ఎన్నుకొనబడిన నాయకుడే ‘ప్రధానమంత్రిగా’ లోక్
సభ అధినాయకునిగా వెలుగులీనటం నేటి మన రాజ్యాంగ
విశిష్ఠత. ‘రాష్ట్రపతి’ దేశానికి మొదట అత్యున్నత
పదవిలో వుండే వ్యక్తికావటం వలన
ఆ ఎన్నిక ప్రజలచేత
ఎన్నుకోబడిన నాయకుల ద్వారా జరగడం
వలన ‘గణతంత్ర’ (రిపబ్లిక్)
దేశముగా వన్నెకెక్కింది.
‘ఉపరాష్ట్రపతి’
ఎన్నిక కూడా రాష్ట్రపతి ఎన్నికలాగే
జరిగి ‘రాజ్యసభ’ని అలరించే
అత్యుత్తమ అధికారిగా వాశికెక్కడం గమనార్హం.
సమానత్త్వం, సౌభ్రాతృత్వం ధనిక-పేదల మధ్య తారతమ్యాలు
లేకుండా దేశప్రజలు పరిపాలింపబడుట వలన
‘సామ్యవాద’ (సోషలిస్ట్) దేశముగా రూపుదిద్దుకుంది.
భారత
రాజ్యాంగము లౌకిక మతాతీత స్వభావముతో
వన్నెకెక్కి ఇచట వున్న
విభిన్న మతాలు సమదృష్టితో గౌరవించి
పరిపాలింపబడుట వలన ‘లౌకిక వాద’
(సెక్యులర్) దేశముగా విశ్వవిఖ్యాతి చెందినది.
ఎన్నో
విభిన్న రాజ్యాంగ విధానాలు ఒకే
దేశంలో నిబిఢీకృతమై వుండుట వలన భారతరాజ్యాంగము
ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ (సావరీన్) రాజ్యాంగతీరు సంతరించుకున్నది.
మన
రాజ్యాంగ సూత్రాలు అత్యంత విపులీకృతమై
వ్రాయబడుట వలన 'లెంక్తియస్ట్ రిటన్
కాన్స్ స్టిట్యూషన్ ఇన్ ద
వరల్డ్ ' గా విశేష
ప్రాముఖ్యతతో అలరారటం గణనీయశోభితం. ఇన్ని
విభిన్న రీతులతో విశిష్ఠరూపంలో నిలిచిన
దేశం ప్రపంచపటంలో వేరొక
దేశం లేదు. ఇది
మన భారతీయులందరు గర్వపడవలసిన
విషయం.
నేడు
ప్రతీవ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా స్వశక్తితో
స్వయంసంపాదన న్యాయబద్ధంగా చేసుకుని ఆర్థికంగా పెరగటానికి
అభిలాష పడటటం గమనార్హం. నేటి
రోజుల్లో మన దేశంలో
కూడా ఈ విషయమై
యువతకు అనుకూలవాతావరణం ఏర్పరిస్తే దేశాభివృద్ధి చేయటానికి
వారి తెలివితేటలు ఎంతో
ఉపయోగపడతాయి. పెట్టుబడిదారీ (క్యాపిటలిజం) అనే ఆర్థికవ్యవస్థ
అమెరికా, ఇంగ్లాండు, జపాన్, జర్మనీ,
బంగ్లాదేశ్ వంటి దేశాల్లో బహుళ
ప్రాచుర్యంలో వుంది. ఇచట వ్యక్తిగతంగా
ప్రతీ ఒక్కరు అభివృద్ధిలోకి రావటానికి
తొలిదశలో ప్రభుత్వ పన్ను సంపాదనపై స్వతంత్రార్జనపై
నిబంధనలు లేకపోవటం వీరికి ప్రభుత్వాలు
ఇచ్చే వరాలు. సంస్థలు అభివృద్ధి
పథంలో చేరిన తరువాత పన్నులభారం
పడుతుంది. జనసాంద్రత తక్కువగా సహజవనరులు
అధికంగా గల దేశాల్లో ఈ ఆర్థిక
సిద్ధాంతం కొంతవరకు విజయవంతమైంది.
మనదేశంలో
1956 లో క్యాపిటలిజం + సోషలిజం కలిసి ‘మిక్స్డ్ ఎకానమీ’
అనే సిద్ధాంతం పబ్లిక్
+ ప్రైవేట్ సెక్టర్ల అభివృద్ధికై అమలులోనికి
వచ్చింది. దీనివలన ప్రైవేట్ సంస్థల
పెట్టుబడిదారులు ఆ సంస్థలకి యజమానులవుతారు. డబ్బున్నవారు పరిశ్రమలు స్థాపించగా కార్మికులు
జీవనోపాధికై శ్రమిస్తారు. ఈ సంస్థలు
ప్రభుత్వ ఆధ్వర్యంలో వారి నిబంధనల
ప్రకారం పనిచేయగా ప్రైవేట్ యాజమాన్యాలు
తమ సంస్థల ద్వారా
వచ్చే లాభనష్టాలకి తామే బాధ్యులై వుంటారు.
వీరి స్వేచ్చా స్వాతంత్ర్యాలు,
ఆర్జనలు ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారుల ద్వారా
పర్యవేక్షింపబడుట వలన కొన్ని
అన్యాయమార్గాలు, అక్రమాలు దరిచేరకపోవచ్చు. దీనివలన
కార్మికుల ఆర్థికస్థితిలో అంత మార్పులు
వుండకపోయినా యజమానులు తమ ఆర్థికలెఖ్ఖల్లో
తప్పుడు మార్గాలు చేర్చటానికి అవకాశాలు
అధికం.
ప్రస్తుత
పరిస్థితుల్లో మనవిద్యావంతులు, విద్యార్థులు తమ స్వయం
ఉపాధితో దేశాభివృద్ధి చేయటానికి వారి తెలివితేటలు,
శక్తిసామర్ధ్యాలు, ఎంతో ఉపయోగపడతాయి. తెలివైనవారికి,
పనిచేసే సామర్ధ్యం వున్నవారికి, ప్రభుత్వ
ఉద్యోగాలు అందుబాటులో లేనివారికి. విద్యార్ధి
దశలో కారణాంతరాల వలన
చదువుని ముందు వరియలేనివారికి, ఆర్ధికంగా
వెనుకబడిన వారికి
ఈ విధానాలు ఎంతో
ఉపయోగపడతాయి. నేటి యువతకు మనదేశంలో
కూడా ఈ అనుకూలత
ఏర్పడితే ధనసంపాదన అన్నది కొందరి
చేతుల్లో మాత్రమే నిలవదు అన్నది
నానమ్మకం. మరిమీరేమంటారు?
ప్రస్తుతం
భారతదేశంలో క్యాపిటలిజం గాని, మిక్స్డ్
ఎకానమీ గానీ అంతగా ముందు
వరియలేదు. ఇవి సుస్థాపితమవ్వాలంటే
ప్రభుత్వ సహకార మొక్కటే లభ్యమైనా
వ్యక్తిగతంగా కూడా ప్రజల్లో పనినియంత్రణ,
నిబద్ధత, సమయపాలన, చురుకుతనం, సూక్ష్మ
గ్రహణత, తెలివితేటలు, నీతి, నిజాయితీ, ఓర్పు,
నేర్పు, గమ్యం చేరుకునే లక్ష్యం,
మంచిమాటతీరు లాంటి గుణాలు చాలా
అవసరం. ఈ పైన
చెప్పినవి చాలా తక్కువమందిలో అరుదుగా
కనిపించే గుణాలు. అతిబద్ధకం, సోమరితనం,
నిస్సత్తువ, కాలం విలువ తెలియకపోవటం
లాంటి ఎన్నో అంతఃశ్శత్రువులు పొంచి
వుండి అనుక్షణం మనిషిలోని శక్తిని
నిర్వీర్యం చేస్తున్నాయి. వీటిని ప్రతీవ్యక్తి అధిగమించిననాడు
స్వసంపాదన అనేది తాము ప్రతిష్ఠించిన
సంస్థలద్వారా సులభతరమవుతుంది. వీరు అర్ధికంగా స్వశక్తిమీద
నిలబడటమే కాక తమ
సంస్థల్లో కొన్ని కుటుంబాలకి ఆర్థికపరమైన
ఆసరా ఇవ్వగలరు.
ఏ
సంస్థలైనా అభివృద్ధిలోకి రావాలంటే సంఘ యజమానులు,
వారిక్రింద పనిచేసేవారు వేసే ప్రతీ అడుగు
ఆచితూచి వెయ్యాలి. ఎందుకంటే మనం
వారి పనితీరుని రెండుకళ్ళతో
గమనిస్తే వారిక్రింద పనిచేసేవారు వేయికళ్ళతో
గమనిస్తారు అన్న సత్యం మరువకూడదు.
ఒకసారి ఎవరి దృష్టిలో అయినా
తేలికభావం వచ్చి పేరు పోగొట్టుకుంటే
తిరిగి మంచిపేరు సంపాదించడానికి చాలా
సమయం పడుతుంది. కొందరు
జీవితకాలమంతా ఆ పేరు
ప్రతిష్ఠలు నిలుపుకోవడానికి కృషిచేయవలసి వస్తుంది.
మహాత్మాగాంధీగారు
విరచించిన ‘డిగ్నిటీ ఆఫ్ లేబర్’
సూక్తి ఏ సంస్థలో
పనిచేసే వారైనా పాటించటం అత్యంత
అవసరము. ఎందుకంటే ప్రతీ ఒక్కరు
తమదైన వృత్తిపైన గౌరవాభిమానములు కలిగివుండటం సర్వదా గౌరవం. తమ
వృత్తిపట్ల ఎన్నడు తేలికభావంగాని, ఇతరులు
అగౌరవపరచినా క్రుంగిపోవటం కానీ అవమానభారంతో అసంతృప్తికరంగా
పనిచేయుటగానీ చేయకపోవటంగానీ కూడనిది. మనిషి తనను
తాను ఆపదలో రక్షించుకోవడానికి
ఎలా తాపత్రయపడతారో తమ
వృత్తిపైన గౌరవాన్ని కూడా అలాగే
పరిరక్షించుకోగలగాలి. అప్పుడే ‘డిగ్నిటీ ఆఫ్
లేబర్’ అన్న పదానికి అర్థం
సమన్వయమవుతుంది. నేడు వృత్తిగౌరవం ఆత్మన్యూనతతో
అలమటిస్తోంది. కారణాలు అనేకం. ప్రతీవారు
ఎ.సి. రూమ్స్
లో కంప్యూటర్ ముందు
ఆధునిక పరికరాలతో వసతులతో చేసేపనే
ఉన్నతమైన వృత్తి అన్న తప్పుడు
భావంతో వుండటం వలన ‘డిగ్నిటీ
ఆఫ్ లేబర్’ కుంచించుకుపోవటం
జరుగుతోంది. ప్రతీవారికి తమతమ వృత్తులపై అంకితభావం,
తృప్తి, నమ్మకం కలిగిననాడు ‘డిగ్నిటీ
ఆఫ్ లేబర్’ అన్న
పదానికి అర్థం సమన్వితమవుతుంది. ఇది
సత్యదూరం కానినాడు ఆ స్వర్గమే
వచ్చి మీ వాకిలి
ముందు నిలుస్తుంది.
ప్రతీ
మనిషిలో అధిక సంపాదన, అధిక
పదవీకాంక్ష సంకుచితభావాల్ని దురాశని ఈర్ష్యాద్వేషాల్ని పెంచుతాయి.
‘దురాశ దుఃఖానికి చేటు’ అన్ననుడికారం
వీరికి వర్తిస్తుంది. బ్రహ్మ తన సృష్టిలో
రెండే మార్గాలు నిర్దేశించడం జరిగినది.
1) ధర్మమార్గం; 2) అధర్మమార్గం. ధర్మమార్గంలో నడిచేవారు దేవతలకు ప్రీతిపాత్రులై
సర్వసుఖాలు అనుభవిస్తారు. అదే అధర్మమార్గంలో
నడిచేవారు దేవతలకు అప్రియులై అష్టకష్టాలు
అనుభవిస్తారు. జీవితంలో శాంతి, నెమ్మది
పోగొట్టుకుంటారు. వారి విజయం కూడా
తాత్కాలికమే.
ప్రభుత్వం
చేసే ప్రతీ సంస్కరణలో
అర్థం, పరమార్థం తప్పక వుంటుంది
అన్నది ప్రతీ ఒక్కరు గ్రహించుకోవాలి.
ప్రభుత్వానికి అవసరమైన సహేతుకమైన సలహాలు
ఇవ్వాలి. కానీ ప్రతీపనిని ఎద్దేవా
చేసే గుణాలు ఎందుకు
కొరగావు. విమర్శలెప్పుడు ఆరోగ్యకరమైన రీతిలో చేసిననాడు వాటి
విలువలు పెరగడమే కాక విమర్శకులపై
గౌరవాభిమానాలు ద్విగుణీకృతమవుతాయి. మనిషిలో వెల్లువెత్తిన వివేకాన్ని
అభివృద్ధి పథంవైపు నడుపుతాయి.
ప్రతీ
భారతీయుడు ఈ దేశంలో
నిలిచినంతకాలం వారి మనస్సుల్లో మెదిలేది
పలుకుల్లో పలికేది వీనులతో వినగలిగేది
కనులతో చూడగలిగేది చేతలలో నిరూపించేది
నడతలో నిలుపగలిగేది నేటి భారత విశిష్ఠ
రాజ్యాంగ విధానాన్ని అభినందిస్తూ ఈ
గీతం స్ఫూర్తిదాయకం కావాలి
అని ఈ విధంగా
అభివర్ణించడమైనది.
“జయహే
భారత అధినాయక జననీ
జయహే
త్రివర్న పతాక సంరక్షిణీ
జయహే
నమః సుమాలంకారిణీ
జయహే
ప్రజాస్వామ్య పరిరక్షిణీ
జయహే
గణతంత్ర విధాయినీ
జయహే
సామ్యవాద సమవర్తినీ
జయహే
సర్వమత సమతా ప్రకాశినీ
జయహే
సర్వశ్రేష్ఠ వరప్రదాయినీ
జయహే
సమస్తలోకవందినీ”.
నేరెళ్ళ రాజకమల.