యుగయుగాల
నుంచి న్యాయ విచారణ అన్నది
మన వేదాల్లో నిబిడీకృతమైవున్నది.
ఏ కాలమైనా ఏ
దేశమైనా న్యాయశాస్త్ర రీతి నీతి కాలానుగుణంగా
మారుతూ ఉండాలి. ఈ విధంగా
మనం న్యాయాన్యాయాల్ని విశ్లేషించగలిగిననాడు
విధించే శిక్షల్లో కూడా మార్పు
వస్తుంది. సమస్యలు చాలావరకు పరిష్కరింపబడతాయి.
న్యాయనీతికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు
భారతచరిత్రలో నేటికీ సజీవంగా నిలిచిన
సంఘటనలు సర్వదా అనుసరణీయమే. ఈ
నీతిసూత్రాలు పుక్కిట పురాణాలే అని
కొట్టి పారెయ్యకుండా వాటిల్లో దాగిఉన్న నీతి
సందేశాల్ని ఆకళింపు చేసుకుంటే ప్రస్తుత
న్యాయవ్యవస్థ సర్వాభిమతమవుతుంది.
ఒక
న్యాయతీర్పు చేప్పే భర్తగా, మహారాజుగా
శ్రీరామచంద్రుని ధర్మనీతి, రాజ్యనీతి ఆతని
పత్ని సీతను అగ్నిపరీక్షకు నిలబెట్టిందనీ
రామాయణంలోని ఒక ధర్మసూత్రం
సర్వజనవిదితం.
న్యాయపరిరక్షణ
తన గతి తప్పినపుడు
అన్యాయం అపహాస్యాలు చేసే వేళ
ద్రౌపది వేసిన ప్రశ్న అతిరథ
మహారథులను, కురు, వృధ్హ బాంధవులనేకమందిని
నీతికోవిదులతో నిండిన కౌరవసభను తలవంచుకొనేలా
చేసింది.
విగతజీవులైన
తన తమ్ముల ప్రాణరక్షణకై
ధర్మరాజు ఇచ్చిన 108 యక్ష ప్రశ్నలకు
ఉత్తర్వులు నీతిధర్మమేమిటో నేటి యుగానికి తెలియచెప్పడం
అద్భుతం. ఇక్కడ ధర్మజుడు ప్రదర్శించిన
నీతిముందు దేవతలే అచ్చెరువొందారు. న్యాయనీతికి
మెచ్చిన యక్షుడు పాండవానుజులను జీవంతవాగి
అలరింపచేయడమే న్యాయానికి జరిగిన విజయం.
నీతికోవిదుడుగా
వినుతికెక్కిన విదురుని నీతిముందు సమస్తభారతావని
తలవంచింది. భారతంలో
‘విదురనీతి’గా శాశ్వతంగా నిలవడమే కాక
అందులో విపులీకరించని విషయం లేదు. ఇది
ఎప్పటికీ న్యాయవాదులకు ఆదర్శమే.
తనదైన
పట్టుదలతో అతిసూక్ష్మమైన నీతికుశలతతో యమధర్మరాజునే ఎదిరించి పతిప్రాణాలు దక్కించుకున్న
సతీసావిత్రి నీతికుశలత ముందు ధర్మశాసనుడైన,
అతికఠినాత్ముడైన యమధర్మరాజు సైతం తన
ఓటమిని అంగీకరించవలసి వచ్చినది.
మౌర్యవంశ
ప్రతిష్ఠాపన చేయించి అర్థశాస్త్ర విరచితుండైన
కౌటిల్యుని నీతిసూత్రాలు భారతదేశంలో అహింస ప్రతిష్ఠాపనకి
దోహదపడటం నాటికీ, నేటికీ, ఎప్పటికీ
ఆదర్శమే.
తమ
మాటచతురతతో, యుక్తితో, తెలివితో న్యాయాన్ని
హాస్యరూపంలో వెల్లడించి అత్యంత కఠిన
సమస్యల్ని సునాయాసంగా పరిష్కరించిన ‘వికటకవి’గా
పేరొందిన తెనాలి రామలింగని పేరు
శ్రీకృష్ణదేవరాయలు కీర్తి వున్నంతకాలం అజరామరమే
అవుతుంది.
ఒకశక్తివంతమైన
ధర్మసింహాసనంపై కూర్చునే ముందు ఆ
సింహాసనానికి ఇరువైపుల నిలిచిన ‘32’ సాలభంజికల
ధర్మసందేహాల్ని నివృత్తి చేసి ధర్మసింహాసనం
అధిష్ఠించడానికి అర్హత సంపాదించి సర్వజనులకు
న్యాయ తీర్పు ఇచ్చిన ప్రతిభావంతుడు,
బుద్ధి కుశలోపరి అయిన ఉజ్జయినీ
దేశాధినేత విక్రమార్కుని పేరు భారతచరిత్రలో శాశ్వతంగా
నిలబడటమే కాక ఆయన
పరిపాలించిన కాలం ‘విక్రమార్కశకం’గా రూపుదిద్దుకుంది.
న్యాయతీర్పు ఇవ్వడంలో అక్బర్ చక్రవర్తికి
ముఖ్య సలహాదారుడుగా నిలిచిన బీర్బల్ తన
హాస్యయుక్తితో, తెలివితో సమయస్ఫూర్తిగా చేసిన
న్యాయరక్షణ, దేశరక్షణ మొఘల్ చక్రవర్తుల
పేరుప్రతిష్ఠలు ఈ దేశచరిత్రలో
నిలిచినంత కాలం శాశ్వతమే. నీతికథల
సంపుటిగా ప్రసిద్ధి చెందిన మిత్రలాభం,
మిత్రభేదం కథలు రచించిన చిన్నయసూరి
జంతువుల ద్వారా నీతివెలుగులు చిందించడం
న్యాయరక్షణకై ఉపాయకరమైన వివిధసూత్రాలు వెల్లడించిన
అద్భుత కృషిని నేటికీ కీర్తివంతం
చేయడం సృష్టిలోనే అమోఘం. జీవితగమనంలో
చుట్టుముట్టే ఆపదల బారినుంచి మనల్ని
మనం ఎలా రక్షించుకోవాలో
ఈ చిన్నచిన్న కథల
ద్వారా జగతికి విపులీకరించారు.
ఈ
కాలంలో కూడా పిల్లలు ఈ
కథలు తమ పాఠ్యపుస్తకాల్లో
లేదా ఇతర కథల
సంపుటిల్లో చదవటానికి అత్యుత్సాహం కనపరుస్తున్నారు.
భవిష్యత్తులో కూడా ఈ నీతికథల
ద్వారా నేటియువతరం న్యాయనీతి నిలుపుతారని
ఆశించవచ్చు. ఆ కాలం
నుంచి భారతదేశంలో పైన ఉదహరించిన
కొన్ని సత్య నిగూఢిత సంఘటనలు,
రచనలు, ధర్మంకోసం, నీతికోసం చేసిన
కృషి జగతిలో శాశ్వతంగా
నిలవడమేకాక వీరిని మహితాత్ములుగా నిలిపింది.
దేవ, మానవ, పశు,
పక్ష్యాదులు సహితం నీతికోసం చేసిన
కృషి అలవికానిది, వెలకట్టలేనిది.
సర్వకాలసర్వావస్థల్లోను వినూత్న సందేశాల్ని ఇలలో
స్థాపితం చేసేది అని నేనంటాను
మరిమీరేమంటారు?
అన్నివిధాల
ధీటుగా సరిసమానమైన న్యాయవేత్తలు నాడేకాదు,
నేడుకూడా వున్నారు. ప్రతీ న్యాయ
స్థానంలో న్యాయదేవత కనులకు నల్లపట్టీతో
చేతిలో త్రాసుతో న్యాయవిచారణ స్వపరబేధం
లేకుండా జరిగేవేళ ప్రతీ ముద్దాయి
బోనులో తమతమ అభిప్రాయాలు భగవద్గీతమీద
ప్రమాణం చేసి న్యాయస్థానంలో చెప్పే
మాటలు పరిగణనలోకి తీసుకొనబడతాయి. న్యాయవాదులు
తమతమ వాగ్వాదాలతో న్యాయాన్ని
నిరూపించగా ఉన్నతన్యాయాధికారి తీర్పుతో కేసు పరిసమాప్తమవుతుంది.
ఇది ప్రతీకోర్టులో కనిపించే
వీక్షణం. నేడు మన న్యాయవిధానం
ప్రకారం అన్యాయం చేసినవారు శిక్షనుంచి
తాత్కాలికంగా తప్పించుకున్న ఫరవాలేదు. కానీ ఎంత
కాలమైనా సరే న్యాయానికి
ఎట్టి పరిస్థితుల్లోను అన్యాయం జరగకూడదు అన్న
నీతి సూత్రానికి కట్టుబడి
వుండటం వలన కేసుల
విచారణ తీరులో ఎంతో కాలవ్యవధి
పడుతోంది. మనదేశంలో ఏ కేసులోనైనా
పట్టుబడిన వారిని శిక్షించడం అంత
సులభతరం కాదు. అత్యంత వేగంగా
సమస్యలు పరిష్కరింపబడటం కుదరని విషయం. చాలా
కేసుల్లో ముద్దాయి స్టే ఆర్డరు
కోర్టు నుంచి తెచ్చుకోవడంతో కేసు
వాయిదాలలో కొంతకాలం గడవడం క్రిందికోర్టులో శిక్ష
నిరూపితమైన తరువాత శిక్షార్హులు బెయిలుమీద
విడుదలై రావటం, మరల హైకోర్టుకి
అప్పీలు తిరిగి చాలాకాలం విచారణ
వలన కాలహరణం జరుగుతోంది.
కోర్టులో విచారణ తేలి శిక్ష
పడే సమయానికి కొందరి
విషయంలో జీవితకాలం అంతా ఎదురుతెన్నులు
చూసినా సకాలంలో విచారణకు రాని
కేసులెన్నో పరిష్కారం చూపబడటం లేదు.
ప్రస్తుత కాలంలో కోర్టుకి వెళ్ళితే
అత్యంత సమయం వ్యర్ధం అవటం
సర్వసామాన్యం. ఇది జగద్విదితం.
మనం ఏమీ అనడానికి
వీలుగాలేదు. భారత న్యాయరీతి ప్రకారం
సర్వాధికారములు న్యాయస్థానంలో నిబిఢీకృతమై వున్నాయి. వారి నిర్ణయం
పైనే ప్రజల మనుగడ
ఆధారపడి వుంది.
'ఆలస్యం
అమృతం విషం' అన్న నానుడి
న్యాయవిశ్లేషణ వద్ద నిలిచి నీతిని
అవినీతిగా, సత్యాన్ని అసత్యంగా, ధర్మాన్ని
అధర్మంగా, నిజాన్ని అబద్ధంగా తగిన
సాక్ష్యాధారాలతో నిరూపితం చేయవచ్చు. తప్పుచేసిన
వారికి సాధ్యమైనంత త్వరగా శిక్ష అమలు
చేస్తే వారు తప్పించుకోవడానికిగాని, తప్పుడు
దారి వెతకటంగాని, కేసు
మాఫీ చేసుకునే ప్రయత్నాలు
గానీ రికమండేషన్స్ ద్వారా
కేసు రూపుమాపటంగానీ, తప్పుడు
సాక్షులను వెతికి కోర్టులో హాజరు
పరచటం గానీ జరగకపోవటమే కాక
కొన్ని దురాలోచనలు, ప్రక్కదారులు, అడ్డదారులు ఎన్నో చెడుమార్గాలు
మూసుకుపోతాయి. న్యాయం అణచివేయబడే దుర్దినం
నేటికాలం వారికి రాకూడదు.
భారత
న్యాయశాస్త్ర వ్యవస్థలోని సూత్రాలు అమలుపరిచే తీరు
విధానం ఎప్పుడో బ్రిటీష్ వారి పరిపాలన
సమయంలో ఆకాలానికి అనుగుణంగా వారి
స్వలాభాపేక్షతో వ్రాయబడినవి. నేటికీ మనం చాలావరకు
పాతన్యాయసూత్రాలు మార్చకుండా వాటినే అనుసరిస్తున్నాము.
ఇది వేగవంతమైన యుగం.
ఎవ్వరికీ కాలం వ్యర్ధం చేయటం
ఎంతకీ తేలని కేసుల గురించి
విచారించడానికి కాలం వ్యర్ధం చేయడానికి
తగిన తీరిక, నేర్పు,
ఓర్పు, సహనం లాంటి గుణాలు
శూన్యం. ఆలస్యం అయిన కొలదీ
సమస్యలు మరింత జటిలమవుతాయే తప్ప
సులభరీతిని పరిష్కరింపబడవు. ప్రస్తుత కాలంలో దేశప్రజలు
మారారు. సమస్యలు మారాయి. కాలానుగుణంగా
మనుష్యుల మనస్తత్వాలు మారాయి. కాబట్టి కాలాన్నిబట్టి
నిర్దేశింపబడిన తీర్పులు సవరించి శిక్షలు
అమలుపరిస్తే సర్వత్ర అభిమతం. మనన్యాయ
సిద్ధాంతాలను కొన్నైనా నేటి కాలానికి
అనుగుణంగా మార్చి క్రొత్తరూపు తేవాలి
అన్నది జనవినతి. అది సాధ్యమయ్యేది
ఈ విధంగా.
ప్రతీ
చిన్న సమస్యకి కోర్టును ఆశ్రయించటం నేడు
పరిపాటి అయిపోయింది. దీనివలన కేసులు ఎక్కువై
గుట్టలుగా ఎంతకీ తెగని సమస్యలతో
ఫైళ్ళు పేరుకొనిపోయాయి. ఇవి అధికమైనపుడు
పరిష్కరించనలవి కాని సమయంలో ప్రత్యేక
కోర్టులు సుప్రీంకోర్టుకి సమానస్థాయిలో అధికార హోదాతో పనిచేయ
వీలు కల్పించినపుడు న్యాయాధికారుల
పని కొంతవరకు సులభతరమవుతుంది.
నేటికాలంలో
వకీళ్ళు కూడా డబ్బు సంపాదనే
తమ ముఖ్యోద్దేశ్యముగా వ్యవహరింపక
తగురీతిలో తమ శక్త్యానుసారం
సమస్యలు త్వరితగతిని తీర్చటానికి ప్రయత్నించాలి.
నేడు
ప్రజల్లో న్యాయపోరాటం జరపాలన్న ఉద్దేశ్యం కన్నా
సమస్యని వాయిదావేయటానికి కోర్టుని ఆశ్రయించటం ఒక
విధంగా ప్రత్యర్ధి మీద కక్ష
తీర్చుకోవడమే ముఖ్యోద్దేశ్యముగా కనబడుతోంది. ఇటువంటి సమయం ఆసన్నమైనపుడు
ఇరువర్గాలు తమ సమస్యని
శాంతియుతంగా పరిసమాప్తి చేసుకుంటే ఒప్పందాలకి
వస్తే ఎన్నోజటిలమైన కేసులు పరిష్కరింపబడతాయి.
గ్రామపంచాయితీల
ద్వారా పరిష్కరింపబడే సమస్యలు కూడా నేడు
హైకోర్టు, సుప్రీంకోర్టు అని ప్రతీచిన్న
సమస్యకి ఆశ్రయించటం వలన లక్షలకొద్దీ
ధనం వకీళ్ళకి మూల్యంగా
చెల్లించటం కాలవ్యయం జరుగుతోంది. ఈ
పంతాలవలన పట్టుదల వలన ఎవరికీ
శాంతి సుఖం లేదు. కావున
శాంతి, నెమ్మది నిలపడం అనేది
గ్రామం నుంచే మొదలుకావాలి. దేశంలో
అత్యున్నత న్యాయాలయం సుప్రీంకోర్టు కాబట్టి
వారి తీర్పే సామాన్యులకు
కూడా శిరోధార్యం కాబట్టి
అక్కడ సమస్యలు అధికంగా పేరుకుపోయాయి
కాబట్టి న్యాయనిరూపణకి తగిన సమయం తక్కువ
కాబట్టి అతిశక్తివంతమైన న్యాయాధికారులు ప్రజలమధ్యకి ఉన్నత అధికారంతో వచ్చి
కేసులు పరిష్కరించడం ఉత్తమోత్తమమైన మార్గం.
ప్రభుత్వనియమాలు
ఉల్లంఘించిన కేసులు ఎన్నో నేటిరోజుల్లో
పెరుగుతున్నాయి. ప్రజలు తమవంతు సహకారం
అందించి నియమనిబద్ధతలతో నడిస్తే ప్రభుత్వానికి దేశానికి
ఎంతో ఉపకారం చేసినవారు
అవుతారు.
రక్షణసిబ్బందిచే
పట్టుబడినవారికి తక్షణమే తగిన శిక్ష
విధించడానికి కొన్ని అధికారాలు కలుగచేస్తే
సివిల్ కేసులు ఎన్నో కోర్టుని
ఆశ్రయించకుండానే పరిష్కరింపబడతాయి. పట్టుబడితే రక్షణ అధికారులు
కఠినంగా శిక్షిస్తారు అన్న భయం ప్రజల్లో
కలగాలి అంతేగానీ ఫైన్ వేస్తే
కట్టేయడం, జైలుకి వెళ్ళిరావటం సర్వసామాన్యంగా
భావించే వారున్నంతకాలం సమస్యలు పరిష్కరింపబడవు. సామ,
దాన, భేద, దండోపాయాల్లో
ఏ ఆయుద్ధాన్నైనా ఉపయోగించి
శిక్షించటం నేటి పద్ధతి కావాలి.
ఇక
మిగిలిన క్రిమినల్ కేసుల్లో న్యాయవాదులు
తమ వాద ప్రతివాదాల ద్వారా గొంతు
చించుకు అరిచినా నిజం బయటకు
రాకపోవచ్చు. కొన్ని కేసుల్లో ఎప్పటికీ
వీరిని పట్టడానికి సి.బి.ఐ. (సెంట్రల్
బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) నిఘా
వేసి మామూలుగా ప్రజలమధ్య
తిరుగుతూ నిజం కనిపెట్టగలగాలి. ఇదే
పూర్వకాలంలో గూఢచారులు లేదా ప్రభువులే
ప్రజలమధ్యలోనే తిరిగి నిజాన్ని వెలికితెచ్చేవారు.
ప్రజల సమస్యలు తీర్చడానికి హంగులు,
ఆర్భాటాలు పెడితే జనం భయపడవచ్చు.
అవి లేకుండా సామాన్యులుగా
ప్రజలమధ్య తిరుగుతూ నిజాన్ని వెలికితీస్తే
సత్యానికి తప్పక విజయం కలుగుతుంది.
గ్రామపంచాయితీ
మొదలు సుప్రీంకోర్టు వరకు బహుముఖ రీతులలో
అలరారే అనేక కోర్టులలో జరిగే
విచారణ తీరు, తీర్పు ఒకే
విధంగా వుంటే ప్రజల సమస్యలు
తీరటానికి ఊపిరి వస్తుంది. ఈ
నమ్మకం ప్రజల్లో కలగాలి.
కొన్ని
జటిలమైన సమస్యలు తీరడానికి తప్పుచేసినవారు
మృత్యువు కబళించే వేళ అయినా
తప్పక నిజం చెబుతారు. ఆ
సమయంలోను నిజం వెలికి రాకపోతే
భగవంతుని న్యాయాలయంలో శిక్ష తప్పదు.
న్యాయరక్షణ,
నీతిరక్షణ, ధర్మరక్షణ, శాంతిరక్షణ అనేవి
ఈ భారతదేశ న్యాయసౌధానికి
మూలస్తంభాలు. మనం న్యాయ
సౌధనిర్మాణానికి గతం అనే
పునాది వేసి వర్తమానం అనే
గోడలు లేపి భవిష్యత్తు అనే
ఆలంబన ఇస్తే అది ప్రకృతి
బీభత్సాలకు చెదరదు ఒరగదు అని
నేనంటాను. మరి మీరేమంటారు?
అతి
చిన్నవిగా కనిపించే ఈ మార్పులు
సలహాలు నేటి న్యాయాంగం సమీక్షిస్తే
భారత న్యాయరధ సంకెళ్ళు
తెగి అభివృద్ధి దశలో
ముందుకి సాగుతుంది.
నేరెళ్ళ రాజకమల.
No comments:
Post a Comment