Wednesday, 29 August 2018

సాగరతీరముల వైశిష్టతలు (రెండవభాగం)


కేరళ:- 
సాగరతీరములో మలబారు తీరమున నెలకొనిన భూభాగమే కేరళ అరటి, పనస, పొక, కొబ్బరి, రబ్బరు, సుగంధ ద్రవ్యములు పుష్కలముగా పెరిగే సుసంపన్నమైన ప్రదేశము. ఇచట ప్రజలు ముఖ్యముగా స్త్రీలు కష్టజీవులు. "కష్టేఫలే" అన్న సూత్రాన్ని నమ్మి తమ సేవలతో అనేక వృత్తులపై అంకిత భావముతో ప్రజల సేవ దేవుని సేవ (వర్క్ ఈజ్ వర్షిప్) అను నమ్మకము వీరికి అగణిత గుణశోభని ఇస్తుంది. మాతృభాష మళయాళముపై అంతులేని గౌరవాన్ని పెంపొందించుకొనే స్వభావము గలవారు. అయినా విదేశీభాష ఆంగ్లము అత్యంత సులభ రీతిని వాడుక భాషగా రూపుదిద్దు కొన్నది. భాషలోని యాస తీరు కొందరికి అర్ధముకాని రీతిలో అనిపించినా లయబద్ధముగా సాగే "కధకళి" సంప్రదాయ నృత్యముగా, "మోహినీఆట్టము" శాస్త్రీయ నృత్యముగా విశేష ప్రజాదరణతో నేటికీ శోభిల్లుతున్నవి. వృత్తిలో ధీటుకీ, అంకిత స్వభావానికి వీరితో సరితూగ గలవారు ప్రపంచములోనే లేరు అన్నది జగమెరిగిన సత్యం. సముద్రపు నీరు భూమి వైపునకు చొచ్చుకొని వచ్చి అతిసుందరమైన సరస్సులను "బ్యాక్ వాటర్స్" ఏర్పరచినది.



పర్యాటకులకు వసతి సౌకర్యములతో ప్రకృతి సౌందర్యముల వీక్షణములకు ఎన్నో అవకాసములు కల్పించడమే కాక స్థానిక ఉద్యోగస్థులకు, విద్యార్ధులకు, స్థానిక   వ్యాపారస్థులకు మరియు పరిసర ప్రాంతములలోని గ్రామస్థులకు ముఖ్య నీటి రవాణా సదుపాయములను అత్యంత చవకరీతిలో కలుగ చేసిన కేరళ ప్రభుత్వము దేశములోనే అత్యున్నత స్థానము అలంకరించినది.

పాండిచ్చేరి:- 
తమిళభాషలో "పుదు" అనగా "కొత్త" "చేర్రి" అనగా "పల్లె" అను పదములతో చేరి "పుదుచ్చేరి" అను పేర ప్రఖ్యాతి చెందిన పల్లెప్రాంతముగా, కోరమండల్ తీరములో వెలసిన అత్యంత సుందరమైన మరియు వ్యాపారానుకూలతలకు అవకాశములు అధికముగాగల ప్రాంతముగా విలసిల్లినది.



వేదిక యుగములో అగస్త్యమహర్షి నివాస ప్రాంతముగా అభివర్ణించ బడినది. క్రీ.. 16 శతాభ్ధములో భారతదేశమునకు వ్యాపారరీత్యా వచ్చిన ఫ్రెంచి వారి పరిపాలనలొ ఉన్నా, తదనంతరము 16-08-1962 భారత దెశములొ కేంద్రపాలిత ప్రాంతముగా విలీనమైనది. కరైకల్, మాహి, యానం, పాండిచ్చేరి అను నాలుగు విభాగములతో చేరి 20-09-2006 "పాండిచ్చేరి" అను నామముతో భారతదేశ 27 రాష్ట్రముగా రూపుదిద్దుకొన్నది. కావేరి (కరైకల్), మహి (మహి), గోదావరి (యానం) నదులు ధరావతు చేసిన ఒండ్రుమట్టి వ్యవశాయదారులకు అత్యంత ఉపయుక్తకరము, కావున ఆహారధాన్యములు ఇచట పుష్కలముగా పెరిగి అధిక దిగుబడులకు  నెలవుగా ఉన్నవి. ప్రముఖ భాషలు ఫ్రెంచ్ మరియు తమిళము అయినా, ఇతర దేశ భాషలు, అత్యంత ఆదరణముతో వెలుగులీనుతున్నవి. హిందూ మతముతో సమానముగా వివిధ మతములు ఇచట గౌరవింపబడటము, వ్యాప్తిచెందడము భారతీయుల సౌశీల్యములకు తార్కాణము. శ్రీఅరబిందో మహర్షి నెలకొల్పిన ఆశ్రమము ఆధ్యాత్మిక, వైద్య, తత్వ, ఆయుర్వేద మరియు యోగ శాస్త్రములకు సంబంధిచిన ఎన్నో విషయములపై ప్రజలకు అవగాహన కల్పించడము వృత్తిపైన గల అంకిత భావనలను పెంపొందింప చేయడము నాటికి నేటికి ఎప్పటికీ ఉపయుక్తకరమే.

మహారాష్ట్ర:- 
"రధి"  అనగా రధమును నడిపేవారు అనే అర్ధమువస్తుంది. మహారధులకు ప్రాంతము ఆలవాలము కావున "మహారధము" కాలక్రమేణ "మహారాష్ట్రము" పేర రూపుదిద్దు కొన్నది. వీరులలో సర్వశ్రేష్టుడైన చత్రపతి శివాజీ పరిపాలించిన భూమిగా, నాడు కట్టిన కోటలు దుర్గములు నేటికీ సజీవముతో నిలిపిన ఘనకీర్తి వీరిది. భారతదేశ స్వాతంత్ర సమరములో మరాఠీయులు ఆంగ్లేయులతో అనేక యుద్ధములుచేసి సంపాదించిన కీర్తి ప్రతిష్టలు భారత చరిత్రలో మరపురానివి. క్రీ. పూ 200 సంవత్సరముల క్రితము ప్రాంతము హిందు రాజుల ఆధ్వర్యములో అనేక శిల్పకళా నైపుణ్యతలతో వెలసిన "ఎలిఫెంటా కేవ్స్" కొన్ని శిధిలమైనా నేటికీ పలువురు దేశ విదేశ ప్రముఖులను ఆకట్తుకొనే తీరు సాగరతీరమునకే తలమానిక. మొదటిసారిగా విక్టోరియా మహారాణి భారత దేశమునకు వచ్చినపుడు (31-03-1931) నిర్మితమైన "గేట్ వే ఆఫ్ ఇండియ" ఆమెకు స్వాగత చిహ్నముగా హిందూ ముస్లిముల సఖ్యతకు తార్కాణముగా అరేబియా సముద్ర తీరములో బొంబాయి నగర నౌకా కెంద్రము వద్ద సుస్థాపితమైనది.



స్వాతంత్రానంతరము చివరిగా ఆంగ్లేయులు సర్వ సైన్యాధిపతులతో ఇంగ్లాండుకు మరలిన ప్రదేశము ఇదే. నేటికీ సాగరతీరమున వారిఠీవికి ధీటుగా మనవారి కీర్తికి త్యాగనిరతికీ నిదర్శనముగా ఎగిరే భారత జాతీయ పతాకము చూసిన భారతీయుల హృదయములు అత్యంత గర్వముతో ఉప్పొంగుతాయి.

పౌరుషానికి, వీరత్వానికి, దీరత్వానికి వీరితో సరితూగ గలవారు ఇలలో లేరు. మరాఠిభాష ఇచ్చోట సర్వాంగ సుందరముగా రూపుదిద్దుకొన్నది. గణపతి నవరాత్రి ఉత్సవములు వీరు అత్యంత వైభవోపేతముగా తీర్చి దిద్దిన తీరు దేశములోనే తలమానికము. ముంబై నగరము హిందీ చిత్రకళా పరిశ్రమకు కాణాచిగా పేరొందినది.  ముడిచమురు (పెట్రోలియం) మరియు ముడిసరకుల ఎగుమతులకు కేంద్రముగా ప్రసిద్ధి చెందినా స్వాతంత్రానంతరము అనేక వస్త్ర తయారీ పరిశ్రమలకు, భారీ పరిశ్రమలకు సుప్రసిద్ధ వ్యాపార కేంద్రముగా భారత దేశములోనే అతి పెద్ద నౌకాకేంద్రముగా నేటికీ  విరాజిల్లుతున్నది.

గుజరాత్:-  
భారత దేశ ఉత్తర దక్షిణ భూ భాగములకు మధ్య వింధ్య సాత్పుర పర్వత శ్రేణులు అమరిఉన్నవి. పర్వతములలో "నర్మదకుండ్" అను ప్రదేశము వద్ద ఉధ్భవించిన తపతి, నర్మద నదములు పశ్చిమ దిక్కుగా పయనించి ఆపరిసరములను సస్యశ్యామలముగా తీర్చిదిద్ది అరేబియా సముద్రములో విలీనమవడము అత్యంత ఉపయుక్తకరము. పరిశుద్ధతకు మారుపేరైన నర్మద "గుజరాత్ జీవనాడి" గా యశస్సు పొంది సప్త పుణ్య నదులలో ఒకటిగా  నాటికి నేటికి నిలిచినది.

సంస్కృత భాషలో "గుర్జరదేశం" అనగా "లేండ్ ఆఫ్ గుజరాతీస్" అని అర్ధము. సాగర తీరము విదేశ వ్యాపారములకు వీరికి అత్యంత అనుకూలముగా నెలకొన్నవి. పశుసంపద అధికముగా ఉన్న ప్రదేశము కావున "ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్" (అమూల్) అను సంస్థ 1948 లో త్రిభువన పాటిల్ వారి యాజమాన్యములో సుస్థాపితమై పశువుల పెంపకదారుల వద్ద పాలను కొని పాలసంభంధిత పదార్ధములను తయారు చేసి దేశ విదేశములలో అమ్మకములు విరివిగా పెంచి "ఆనంద్" నగరము "పాలనగరం" (మిల్క్ సిటి) గా ప్రపంచ విఖ్యాతి పొందిన ప్రదేశముగా తీర్చిదిద్దినారు. ఇందువలన పాల విక్రయదారులకు అన్యాయ అక్రమ దారులు మూసుకుపోవడం మాత్రమే కాక వారి వ్యాపారము అత్యంత సులభతరము లాభకరము అయినది. గుజరాతీయులు ఎందరో విదేశీయుల వద్ద వాణిజ్య నిపుణతలు నేర్చి, వ్యాపారరీత్యా సముద్రయానములు చేసి వారితొ సత్ సంభంధములు నిలుపు కొన్న ఘనత వీరిది అన్నది జగద్యిదితము. ఇచట అనేక మతములతో స్నేహ సౌశీల్యములతో కలసి హిందూ మతము విరాజిల్లుతున్నది.



భారత దేశ చరిత్రలో స్వాతంత్ర సమరములో అత్యంత ప్రముఖ ప్రాధాన్యత వహించిన "ఉప్పుసత్యాగ్రహము"(దండి మార్చి) గుజరాత్ సాగర తీరములో కొనసాగడం తీరములను "తెల్ల ఎడారి" గా అభివర్ణించడము ఒక విశేషమైతే మన జాతిపిత "మహాత్మాగాంధీ" జన్మించిన పోర్బందర్, శబరిమతి ఆశ్రమము గుజరాత్ లో నెలకొని ఉండటము మన భారతీయులకందరికీ గర్వకారణముగా నిలచిన ఇంకొక విశేషము. 01-05-1960 గుజరాత్ మహారాష్ట్ర నుంచి విడివడి ప్రత్యేక రాష్ట్రముగా ఆవిర్భవించినది. వీరు "గర్భానృత్యం" (డాంటియ) లయబద్ధముగా సంప్రదాయ దుస్తులతో హోలి, దీపావళి, దసరా పర్వదినములలో చేయడము వీరి సంస్కృతీ సంప్రదాయములకు నెలవు. స్థానిక ప్రజలు స్నేహశీలురు, సర్వ మతసమతా స్వభావులుమరియు ఉపకార నైజముతో ప్రభావితులు. గుజరాత్ సాగరతీరము 1600 కి మీ విస్తీర్ణమై ఉండటమే కాక స్థానిక వ్యాపారానుకూలతలకు ఎంతో సౌకర్యవంతమైన తీరముగా ప్రజ్వరిల్లుతున్నది.

గోవా:-
అరేబియా సముద్రతీరమున సహ్యాద్రి కనుమలను ఆనుకొని ఉన్న "గోవా" ప్రదేశము కొన్ని వేలమిలియన్ సంవత్సరములకు పూర్వమే ఏర్పడిన భూమి. పశ్చిమ సాగరతీరములో నెలకొన్న ప్రాంతము మహభారత కాలములో (ద్వాపర యుగములో) "గోవుపురి" అనుపేరుతో ప్రశిద్ధి గాంచినది. ప్రస్తుత కాలములొ కూడా అశేష పశు సంపద గల దేశము కావున "నేషన్ ఆఫ్ కవ్ హెర్డ్స్" గా వినుతికెక్కినది. అనేక ఫల భరిత వృక్షములు, వివిధ రకముల ఆహార ధాన్యములు విస్తృతముగా పెరిగే ప్రదేశముగా కీర్తి పొందినది. గోవా 1961 సంవత్సరమువరకు పోర్చుగీసు వారి ఆధ్వర్యములో ఉన్నను 30-05-1987 ప్రత్యేక రాష్ట్రముగా ఏర్పడినది.



భారతదేశములో అతి చిన్న మరియు అతి ప్రముఖ రాష్ట్రము. ఆది కాలము నుంచి నీటిరవాణాలకు అత్యంత అనుకూల పరిస్థితులు దేశవిదేశ వ్యాపారములకు, ఎగుమతి దిగుమతులకు కేంద్రముగా మార్చినవి. స్వాతంత్రానంతరము అనేక సంవత్సరములు  పోర్చుగీస్ ఆధ్వర్యములో  ఉన్నందువలన వారి ప్రభావము జనజీవనముపై అధికముగా ప్రస్ఫుటించడమే ఇచ్చట పాశ్చాత్య నాగరికతకు పునాదివేసినది. నవనాగరిక జీవనశైలిలో దేశవిదేశ పర్యాటకులను విశేష రీతిని ఆకట్టుకొనే సాగరతీర అందములు వర్ణించ అలవికానివి. విద్యా విధానములలో వాడుక భాషలుగా పోర్చుగీస్, ఇంగ్లీష్, కొంకణి మరియు మరాఠి సుప్రసిద్ధము. వ్యాపారరీత్యా  అనేక మతములు భాషలు, సంస్కృతీ సంప్రదాయములతో విలసిల్లినా స్థానికులలో అత్యధికభాగము హిందు సంస్కృతి అనుసరణీయులై అందరితో కలసికట్టుగా జీవనము సాగించడమే భారతీయ ఔన్నత్యతకు నిదర్శనము.

"యూనిటీ ఇన్ డైవర్సిటి " (భిన్నత్వములో ఏకత్వం) మన భారత దేశ విశిష్ఠ రాజ్యాంగ నీతిగా సర్వజనవిదితముభారతదేశములో విభాగము తీసుకొన్నా, తరచి చూసినా, ఏదోనవ్యత, సౌందర్యము, సుసంపన్నతలతో సుశోభితమవుతుంది.

ప్రస్థుతము మన దేశములొ 13 ముఖ్య సహజ నౌకా కెంద్రములు 200 సామాన్య నౌకా కేంద్రములు వెలసి ఉన్నవి. ఇటివల కాలములొ తూరుపు, పడమర దిశలలో సాగరతీరములొ వెలసిన నౌకా కేంద్రముల అభివృద్ధికొరకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యమున 25-03-2015 "సాగరమాల" అను కార్యక్రమము సుస్థాపితమైనది. అనేక ఆర్ధిక, సాంకేతిక, వైజ్ఞాన  సదుద్దేశ్యములను అమలుపరచే ఆశయమ్ములతో దేశాన్ని ముందుకు నడిపే కార్యక్రమమే "సాగరమాల". సుమారు 7500 కి.మీ విస్తీర్ణముతో నెలకొని ఉన్న సాగరతీర నౌకా కేంద్రముల అభివృద్ధి కొరకు రూపొందించబడిన వివిధ ప్రణాళికలు:

·        సాగరతీరమున నెలకొనిఉన్న నౌకాకేంద్రముల అభివృద్ధి.
పురాతన పద్ధతులతో నేటికీ నిలిచిఉన్న కొన్ని నౌకా కేంద్రములకు నవీన,సాంకేతిక విజ్ఞానముతో కూడిన సౌకర్యములు సౌలభ్యములు కల్పించి ప్రగతిపధములోనికి తీసుకొనిరావడము





·        ప్రముఖ నౌకాకేంద్రములకు రోడ్,రైల్వే మార్గములతో సంధానముచేసి దేశ విదేశవ్యాపార వాణిజ్యముల అభివృద్ధి
అత్యంతభారమైన సరకురవాణా సులభరీతిని చౌవుకగా సుదూరతీరములకు ఎగుమతి దిగుమతులకుతోడ్పాటు
సహజ నౌకాకేంద్రముల అభివృద్ధిచేయడమనే ఆకాంక్షలు ఆశయమ్ములు సఫలీకృతమయ్యేరీతిని వాంచిస్తూ వివిధ పుష్పవర్ణములతో రూపుదిద్దుకొన్న పదముల అల్లిక సాగరునికి అర్పించే "సాగరమాల"

                                   "సాగర సౌభాగ్య లావణ్యములే నీలి వర్ణమై
                                       గనులలోని ఖనిజ సంపదలే సువర్ణ వర్ణమై
                                       రమ్యమైన సహజ నౌకాకేంద్రములే శ్వేతవర్ణమై
                                       మానవ సుసంపన్నతలే హరిత వర్ణమై
                                       లక్షల కోట్ల జన సంతోష తరంగములే కాషాయ వర్ణమై"
                                       ఇలలో సాటిలేనివి భారతసాగరతీరముల వైశిష్ఠతలే.

*   *