Wednesday, 7 November 2018

సప్త సంఖ్యల విశిష్టతలు (మొదటి భాగము)


వేద, పురాణ, ఇతిహాసముల ప్రకారము "సప్త" సంఖ్యకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. సంఖ్య ప్రాముఖ్యతతో అలరారే అనేక విషయములను ఏర్చి కూర్చి సంధర్భాను సారముగా వివిధ ఉదాహరణములతో పొందుపరచి వివరించడమే వ్యాస ముఖ్యోద్దేశ్యము.

భూమి సప్త ద్వీపములతో అలరారుతున్నది కావున భూదేవిని "సప్తద్వీపో వసుంధర" అని కీర్తిస్తాము. సప్త సముద్రములతో అనంత నిధులతో వెలసిన దేవిగా మణిద్వీపేశ్వరిని ఆరాధిస్తు చేసే వర్ణనలో సప్త సముద్రములు అనంతనిధులు-యక్ష కిన్నెర కింపురుషాధులు, నానాజగములు, నదీనదములు; మణిద్వీపానికి మహానిధులు" అని మణిద్వీప సౌందర్యాన్ని అనన్య భక్తి ప్రఫుల్లతలతో అభివర్ణిస్తాము.

"సామ్రాజ్యదాయిని సత్యసంధా సాగరమేఖలా దీక్షితా దైత్యశమనీ, సర్వలోకవశంకరీ" అని శ్రీలలితాదేవిని స్తుతిస్తూ భువిపై వెలసిన సప్త సముద్రములను ఆదేవి తన నడుముకు వడ్డాణముగా ధరించి దైత్య సంహారిణిగా సర్వ లోకములను తన వశములో నిలుపుకొన్న శక్తిరూపిణిగా, ధైర్య సాహస, సౌభాగ్య సుసంపన్నతలకు చిహ్నముగా పూజించడము మనదైన నమ్మకానికి ప్రాణం.

శ్రీవేదవ్యాసమహర్షి వారిచే విరచితమైన "శ్రీదేవీ భాగవతములో" సప్త ద్వీపముల మరియు సప్త సముద్రముల ఆవిర్భావములను వివరించడము జరిగినది. పురాణకాలములో వాటి నామధేయములు, వర్ణనలు నేటి కాలములో అవసరము ఉన్నా లేకున్న నేడు సమాజములో వచ్చి చేరిన నాస్తికతలు, హేతువాదములు, మత వివాదములు, సంస్కృతీసంప్రదాయ విభిన్నతలు రూపుమాపి సమన్వయముతో సరిచేసి నాటి కాలములోని భారతదేశ ఆధ్యాత్మికవైభవములు, విశ్వకళ్యాణము కొరకు జరిపిన మంత్రప్రభావిత విజ్ఞానసంపదలు అత్యంత సామాన్యరీతిలో విపులీకరించడమే ముఖ్యోద్దేశ్యము మరియు  సప్త ద్వీపములు, సప్త సముద్రములు నామధేయములు నేటి వ్యవహారిక నామములతో సరిపోల్చి వాటి ప్రాముఖ్యతలతో వివరించబడినవి.

సప్త ద్వీపముల మరియు సప్త సముద్రముల ఆవిర్భావము:-

బ్రహ్మ సృష్టి ఇలపై మొదలిడిన కాలములో సూర్యుడు మేరుపర్వతము చుట్టు చేసే ప్రదక్షిణము వలన భూమిపై సగ భాగము వెలుతురుగాను కొన్నిప్రాంతములు వెలుగులేక చీకటిమయముగా ఎప్పటికీ ఉండెడివి. సూర్యప్రకాశము నోచుకొనని ప్రాంతములలో వెలుగును ప్రసరింప చేయదలచి మొదటి మనువు స్వాయంభువుని కుమారుడు ప్రియవ్రతుడు ధృఢసంకల్పోక్తుడై యోగశక్తితో సూర్యరధముతో సమానమగు రధమును సంపాదించి రెండవ సూర్యునివలె ప్రకాశించుతూ సూర్యుడు మేరువుకి ఉత్తరదిశలో ఉన్నప్పుడు తాను దక్షిణ దిశగా తిరిగి, సూర్యుడు దక్షిణ దిశలో ఉన్నపుడు తాను ఉత్తర దిశగా  పరిభ్రమిస్తూ భూమి చుట్టూ ఏడు ప్రదక్షిణలు కావించెను. ఆపయనములో ఆతని రధ చక్రముల అంచుల తాకిడి వలన ఏర్పడిన అగడ్తలు  ఏడు ఖండములుగా ఏర్పడినవి. అడుగు భాగమునుండి ఏడు సముద్రములు ఉధ్భవించడము జరిగినది. తదనంతరము ప్రియవ్రతుడు తన ఏడుగురు కుమారులను ఏడు ద్వీపములకు అధిపతులనుగావించెను.

జంబూద్వీపము (ఆసియా ఖండము)

"కలియుగే ప్రధమపాదే:జంబూద్వీపే:భరత వర్షే:భరత ఖండే" అని నిత్యపూజలో చేసే సంకల్ప సంస్మరణ జంబూ ద్వీపవాసులకు అత్యంత ప్రముఖమైనది. ప్రియవ్రతుని పెద్ద కుమారుడు "అగ్నిధ్రుడు" పుణ్యభూమికి అధిపతి. జంబు ఫల వృక్షములు (నేరేడు) అత్యధికముగా పెరిగేద్వీపము కావున "జంబూద్వీపము" అనుపేర విఖ్యాతి చెందడము ఒక విశేషమైతే నేరేడు పండు ఏనుగు తల పరిమాణముతో పెరిగి వాటి నుంచి జాలువారే ఫలరసము నదిగా ప్రవహించడము వలన నది "జంబూనది" అను నామముతో ప్రశిద్ధి చెందడము మరియొక వింత. నదీతీరమున వెలసిన శక్తిరూపిణి "జాంబాద్విని". ఈదేవిని భక్తులు ఆరాధించితే సకలైశ్వర్యములు, సర్వసౌభాగ్యములు  సంప్రాప్త మవుతాయి అనునది ఒక ప్రగాఢమైన నమ్మకము. ఫల రసపానము వలన ఇచట వసించువారికి ముసలితనమురాదు. శరీరము ఎల్లప్పుడూ సుగంధభరితమై ఉంటుంది. ముఖము వర్చస్సుతో తేజస్సుతో ధగధగ లాడుతుంది. నేరేడుపండు ఆరోగ్యరీత్యా ఎంతోఉపయుక్తకరము అనునది నేటి వైద్యులు అంగీకరించిన (ఆలోపతి, హోమియోపతి, ఆయుర్వేద) విశేషజ్ఞాన సంకేతము. మొండిరోగములను నశింప చేసే ఎన్నొ ఔషధ మొక్కలు ఈప్రాంతములో అధికము.

భక్తిప్రఫుల్లతలతో ప్రకృతిలోమమేకమై నిత్య జీవనము గడిపే జంబూ ద్వీపవాసులు ధన్యులు. ఆధ్యాత్మిక, యోగ, విజ్ఞానసంపదలకు నెలవైన "భారతవర్షము" జంబూద్వీపములో నిబిడీకృతమై ఉన్నది. ఇచట మన్ను బంగారుమయము. స్త్రీ, పురుషులు అదికముగా అతి మక్కువతో బంగారు ఆభరణములను అలంకరించుకొనడము సర్వ సామాన్యము. భారత వర్షములో పుట్టిన సప్త పుణ్య నదులు అత్యంత పవిత్రతను ఆపాదించు కొనబడటమువలన వీటిలో స్నానమాచరించినా, కనులారచూసినా, పానముచేసినా ఎంతో పవిత్రతను పొందడమేకాక పాప ప్రక్షాళనములకు, ఆరోగ్యమునకు ఎంతో ఉపయుక్తకరము అనునది వేదవిదితము. ఆసియా ఖండము జంబూఫల ఆకృతిలో ఏర్పడిన అతిపురాతన విభాగము. నేటికాలగణనము ప్రకారము ద్వీప విస్తీర్ణము 44579000 స్క్వేర్ కి. మీ. (294880 చదరపు యోజనములు) వివిధ భాషలు మరియు విభిన్న మతములతో అలరారే జంబూ ద్వీపము ఇలలో వెలసిన స్వర్గమే. (ఆరాధ్యదేవిజంబాద్విని; సముద్రము - లవణసముద్రము (హిందూమహాసముద్రము).

క్రౌంచద్వీపము (ఆఫ్రికా)

భూమి పైన ప్రాకృతిక సౌందర్యముతో అలరారే రెండవ పెద్దద్వీపము. పురాణకధనము ప్రకారము ప్రియవ్రతుని కుమారుడు ఘృతపుష్టుడు ద్వీపాధిపతి. అత్యంత సుప్రసిద్ధమైన "క్రౌంచపర్వతము" ఇచట ఉండుటవలన "క్రౌంచద్వీపము" అనుపేర వాసికెక్కినది. శివుని కుమారుడు కుమారస్వామి పర్వతమును చేదించగా చిన్నా భిన్నమై వరుణ దేవుని కరుణతో క్షీరరాశితో నిండినది కావున ఇచట పొంగిపొరలే సముద్రము "పాలసముద్రము" (అట్లాంటిక్ ఓషన్) గా అభివర్ణించ బడినది. చాలావరకు ప్రాంతము ప్రకృతి సౌందర్యములతో, అలవికాని అటవీ సంపదలతో, దుర్భేద్యమైన ఇసుక ఎడారులతో, భయంకర జలపాత ఘోషలతో, కౄరమృగములతో, జనవాసానికి దూరముగా ఎన్నో లక్షల సంవత్సరములు "చీకటి ద్వీపముగా (డార్క్ కాంటినెంట్)" మిగిలిపోయినది. 1,95,000 సంవత్సరములకు పూర్వము పాతరాతి యుగవాసులు వసించిన అతి పురాతన భూమి. ఈజిప్ట్ భాషలో అఫ్రు--కా" అంటే "మాతృభూమి" అని అర్ధము. ఇంకొక ఉదాహరణ "ఆఫ్రి" అను కొండజాతి వారు ఇచట వాసము చేయుటవలన "ఆఫ్రికా" అనుపేర ప్రశిద్ధి చెందినది. ద్వీప వాతావరణము అధిక వేడి కలిగి ఉండటము వలన జనవాసమునకు బహు దూరములో ఉండెడిది అనునది చారిత్రక ఆధారములతో నిరూపితమైనది. ఆఫ్రికన్ వాసులు బానిసత్వపు ఉచ్చులో, వర్ణ విభేధ సంకెలలో బిగుసుకొని ఎన్నో వేల సంవత్సరములు అజ్ఞానులుగా బ్రతకడము మన నాగరికతకే తలవంపు. క్రీ. . 14 శతాభ్ధములో భారత దేశమునకు నూతన సముద్ర మార్గ అన్వేషణలో దక్షిణ ఆఫ్రికా తలపిన వాస్కోడగామా అను పోర్చుగీస్ నావికుడు అచట ఉధృతముగా చెలరేగే సాగర భీభత్సములకు భీతిచెంది తన ప్రయత్నమును విరమించుకొని ద్వీపమునకు "తుఫానుల అగ్రహ ద్వీపము" అను నామాంకితము చేసెను. క్రీ..1457 సంవత్సరములో బార్తలోమాడియాజ్ అను పోర్చుగీస్ నావికుడు తీరమును దాటి ఆఫ్రికా ఖండమును ప్రపంచదేశ నాయకులకు పరిచయము చేసెను. కాలమార్పులతో నవీన మానవ విజ్ఞాన సంపద వ్యాప్తి చెంది ఇచట ప్రజలు తమను తాము నాగరీకులుగా విద్యావంతులుగా ధీటుగా తీరుగా తీర్చిదిద్దుకొనిరి. స్థానిక ప్రజలు అతిధారుడ్యమైన శారీరక బలములో ధీరులు, వీరులు. సంసృతీ సంప్రదాయముల పట్ల అత్యంత శ్రద్ధగలవారు, కష్టజీవులు, ప్రకృతి ప్రేమికులు. సహజవనరులు అతిపుష్కలముగా గల ప్రాంతముగా నేటికీ సుశోభిల్లుతున్నదీ క్రౌంచ ద్వీపము. ద్వీప విస్తేర్ణము 200891 చదరపు యోజనములు. నేటికాల గణనప్రకారము 3037000 స్క్వేర్ కి. మీ. (ఆరాధ్యదైవంవరుణుడు; సముద్రము - పాల సముద్రము (దక్షిణ ఆట్లాంటిక్ ఓషన్).

శాకరద్వీపము (ఐరోపాఖండము)

ఇలపై వెలసిన నాల్గవ పెద్ద ద్వీపముగా ప్రజ్వరిల్లుతున్నది. ప్రియవ్రతుని కుమారుడు "మేధాతిధి" పరిపాలించిన రాజ్యముగా వాశికెక్కిన భూమి. ఈప్రాంతములో "శాక" (టేకు) వృక్షములు అధికముగా పెరుగుటవలన "శాకరద్వీపము" గా ప్రశిద్ధి చెందినది. ఆసియాను ఐరోపా నుండి విభజించిన "ఉరుశృంగములు" (ఉరల్ మౌంటైన్స్) నేటికీ చారిత్రిక ఆధారములతో నిలిచి ఉన్నవి. గ్రీక్ భాషలో "యూరిస్" అనగా "విశాలమైన" "ఒప్స్" అనగా "ముఖము" విశాలమైన ముఖము (వైడ్ ఫేస్) " యురిస్ ఓప్స్ " అను పదము నుండి ఈఖండము "యూరప్" అను వ్యవహారిక నామముతో  విరాజిల్లుతున్నది. పాతరాతి యుగ కాలమునుండి ఈద్వీపము జన జీవనములతో అలరారినది అను విషయము తగిన ఆధారములతో నిరూపితమైనది. "విలియం జేంస్ జాన్" అను విజ్ఞానవేత్త ద్వీపమును "క్లాసికల్ లేండ్" గా అభివర్ణించెను. క్రీ. . 14 శతాభ్ధమునుండి నేటి వరకు (21 శతాభ్ధము) సాహిత్య, సంగీత, ఆర్ధిక వ్యాపార సంపన్నలతో ఎంతగానో అభివృద్ధిచెందిన ప్రాంతము. "కెప్టెన్ జేంస్ కుక్" అను బ్రిటన్ నావికుడు అందమైన సాగరతీర ప్రాంతములను సందర్శించి (22-08-1770) ద్వీపమునకు "ఐలేండ్ కాంటినెంట్" అను నామముతో తనలో కలిగిన అత్యంత ఆనందానుభూతులను ప్రస్ఫుటింప చేసెను. యూరప్ మరియు ఆఫ్రికా ఖండముల మధ్య ప్రవహించే మధ్యధరా సముద్రము (సుర సముద్రము) గా నేటికీ సాక్షీ భూతముగా నిలచిఉన్నది. నిమ్మ, నారింజ, అనాస మరియు ద్రాక్ష ఆదిగా గల ఫల వృక్షములు అత్యధిక దిగుబడులతో ఎంతో దేశ ఆర్ధిక సంపత్తులను పెంపొందింప చేస్థున్నాయి. స్థానికులు పండ్ల రసనిలువలతో తయారుచేసే (వైన్) ముఖ్య పానీయముగా సేవించడము వారి జాతి సంస్కృతి మరియు గౌరవ సూచకముగా భావించడము. అతిసామాన్యము. యూరోపియన్స్ (ఐరోపావాసులు) సదా యుద్ధప్రియులు, వ్యాపార నిపుణులు, ఐశ్వర్యవంతులు, మరియు వీరికి సముద్రయానము అత్యంత ప్రీతిపాత్రము. నూతన ద్వీపములను అన్వేషించుటయు, నూతన సముద్ర మార్గములను కనిపెట్టిన ఖ్యాతి వీరిదే. నేటి కాల గణన ప్రకారము ఐరోపా విస్తీర్ణము 10180000 స్క్వేర్ కి.మీ (67338 చదరపు యోజనములు). (ఆరాధ్యదైవంవాయువు; సముద్రముసుర (మెడిటెరియన్ సీ))

శాల్మలీద్వీపము (ఆస్ట్రేలియ)

ప్రపంచ పటములో అతి స్వల్ప విస్తీర్ణముతో అతి సుందరమైన ద్వీపము. ప్రియవ్రతుని కుమారుడు యజ్ఞబాహువు రాజ్యము ఏలిన ప్రదేశము. సంస్కృత భాషలో "శాల్మలీ" అనగా "బూరుగుచెట్టు" (సిల్క్ కాటన్) అని అర్ధము. మహాపరిమాణము గల శాల్మలీ వృక్షములు  అత్యధికముగా పెరుగుట వలన ఈప్రాంతము శాల్మలీ ద్వీపముగా ప్రాచీన యుగముల నుంచి విరాజిల్లుతున్నది. లాటిన్ భాషలో "ఆస్ట్రలిస్" అనగా దక్షిణ బాగము అని అర్ధము. క్రీ.. 2 శతాభ్ధము వరకు భూభాగము ప్రపంచ పరిశోధనలకు దూరముగా ఉన్నది.

తరువాత కాలములో క్రీ. . 2 శతాభ్ధములో "మేథు ఫ్లిండెర్" అను నావికుడు తీర ప్రాంతమును సందర్శించి సదా మంచుతో కప్పబడి ఉన్న ప్రదేశము కావున "వైట్ కాంటినెంట్" అని నామాంతరము చేసెను. భూమధ్య రేఖకు దక్షిణ దృవ సమీపమున నెలకొన్న ద్వీపము కావున "ల్యాండ్ ఆఫ్ సౌథ్" గా విఖ్యాతి గాంచినది. అనేక వ్యవసాయ పరిశోధనా కేంద్రముల పరిశోధనలు వాటి సత్ఫలితములే అనేక ఫలభరిత వృక్షములు, గోధుమ, బార్లీ, ఓట్స్, మొక్కజొన్న ఆదిగా పెరిగే ఆహారధాన్యముల దిగుబడులే వీరి అభ్యున్నతకి చిహ్నము. వ్యవసాయము, ఉన్ని పరిశ్రమలు, మత్స్య, మరియు మాంస ఎగుమతులు వీరి  ఆర్ధిక సంపత్తులను పెంపొందింపచేసే ఆధారములు. ద్వీపవాసులు శృతధీరులు, వీర్యధరులు, వసుంధరులు, ఓర్పుగలవారు, మరియు ఇషుంధరులుగా వన్నెకెక్కడము జరిగినది. సదా మంచుతో కప్పబడిన ప్రదేశము కావున "పెంగ్విన్" పక్షులు అత్యంత సుందరముగా అల్లాడడము సౌందర్య వీక్షణమే. నేటికాల గణనముప్రకారము ద్వీప విస్తీర్ణము 8600000 స్క్వేర్ కి.మీ (7699 చదరపు యోజనములు). (ఆరాధ్య దైవముచంద్రుడు; సముద్రముదధి సముద్రము (అంటార్క్టిక్))

కుశద్వీపము (సముద్రము లోపల ఉన్న ఖండము)

అవని పై చాలా కాలమువరకు కుశ, శాల్మలీ, ప్లక్ష ద్వీపములు సముద్రగర్భములో నిబిడీకృతమై ఉండెడివి. కాలానుగుణ మార్పులతో ఇవి భూ ఉపరితలముపై చేరి వాసయోగ్యమైనవి. కుశ ద్వీపము మాత్రము నేటికీ సముద్రములోనే నిబిడీకృతమై ఉన్నది. పురాణోక్తిప్రకారము ప్రియవ్రతుని కుమారుడు "హిరణ్యరేతుడు" అధిపతి. ఇచట "కుశ" (దర్భలు) సంవృద్ధిగా పెరుగు ప్రదేశము కావున "కుశద్వీపము" అను పేరుతో వ్యవహరించబడినది. సముద్రజలము గడ్డకట్టి ఎల్లకాలము ఉండుట విశేషము. రసతుల్య, మధుకుల్య, మిత్రవింద, సృతవింద, దేవర్భ, ఘృతచ్యుత్, మంత్రమాలిక ముఖ్య నదులు. ఈద్వీపవాసులు నదీ జలములను స్నానపానాదులకు ఉపయోగించడము సర్వసామాన్యము. ఇచట వసించు ప్రజలు ఉత్సాహభరితులు, నిత్యము సుఖ సంతోషములతో తృప్తికర జీవనము సాగిస్తారు. విషయ పరిజ్ఞానము కలవారు. (ఆరాధ్యదైవముఅగ్ని; సముద్రమునేతి సముద్రము (ఆర్కిటెక్).

ఫ్లక్షద్వీపము (దక్షిణ అమెరికా)

అతి పురాతనమైన త్రికోణాకృతిలో ఏర్పడిన భూభాగము. పురాణోక్తి ప్రకారము ప్రియవ్రతుని కుమారుడు "ఇంద్రజిహ్వుడు" అధిపతి. అత్యంత అపురూపమైన ప్లక్ష (జువ్వి) వృక్షములు అత్యధికముగా పెరిగే ప్రదేశము కావున "ప్లక్షద్వీపము" గా వ్యవహరింపబడెడిది. ఇచట ప్రవహించే నదులను కనులార చూసినా సర్వ పాప విముక్తులు అవుతారు అన్నది పురాణోక్తి. క్రీ.పూ మెసపటోమియనులు వాసము చేసిరి అను విషయము చారిత్రిక ఆధారములతో నిరూపించ బడినది. వీరి వ్రాత విధానము "ఓల్మిక్ ఆర్ట్" అను పేరుతో 1200 బి. సి. కాలమునుండి 400 బి.సి. వరకు అభ్యాసముగా వెలుగొందినది. వరి, సోయా, మొక్కజొన్నలతో అనాస, పనస, ఆవకేడో, జామ, బొప్పాయి ఫలవృక్షములుతో కాఫీ కోకొ ఆదిగా ఎన్నో ఎన్నెన్నో పంట భూములతో కనువిందుచేసే భూమి. క్రీ. 1502 సంవత్సరములో "అమెరిగో వాస్ పుక్సీ అను ఫ్లోరెంటైనా వ్యాపారి ద్వీపములను (దక్షిణ అమెరిక మరియు ఉత్తర అమెరికా) మొదటిసారిగా తలిపెను. భూమికి దక్షిణ దిక్కుగా నెలకొన్న ప్రాంతము కావున "దక్షిణ అమెరికా" అనియు ఉత్తర భాగమున నెలకొన్న ప్రాంతము "ఉత్తర అమెరికా" అనియు ఆతనిపేరుతో (అమెరిగో వస్ పుక్సి) చిరంజీవత్వముతో నేడు విరాజిల్లుతున్నవి.

ద్వీపవాసులు పుట్టుకతో బాహ్యాంభరతేజస్సుతో, జవసత్వ ఓజస్సులతో బుద్ధిమంతులై దీర్ఘాయువుతో వెలుగులీనుతారు. నేటికాల గణనప్రకారము ద్వీపము 17840000 స్క్వేర్ కి. మీ. (11800 చదరపు యోజనములు) విస్తీర్ణము కలిగిఉన్నది. (ఆరాధ్య దైవములుసూర్యుడుఅగ్ని; సముద్రముఇక్షుసముద్రము - దక్షిణ పసిఫిక్ ).

పుష్కరద్వీపము (ఉత్తర అమెరికా)

భువి పైన వెలుగులీనే మూడవ అతి పెద్దదైన అతి పురాతన ద్వీపము. ప్రియవ్రతుని కుమారుడు నీతిహోత్రుడు పరిపాలించిన దివ్య భూమి. ద్వీపానికి ఆనుకొని "పుష్కర ద్వీపము" నాలుగువైపులా "జలార్ణవము" తో  అలరారుతున్నది కావున  ప్రదేశము "పుష్కర ద్వీపం" అను  పేరుతో  పిలువబడినది. ద్వీపములో అగ్ని జ్వాలలను పోలిన బంగారు రేకుల పుష్కరం (తామరపువ్వు) వెలసి ఉండటమువలన అది బ్రహ్మాసనముగా పరిగణింపబడటమే అత్యంత అధ్భుత విశేషము.

ద్వీపమునకు ఆవలతీరమున 'లోకాలోకం" అను పర్వతము సూర్యకాంతి ప్రసరించే లోకములకు, ప్రసరించని లోకములకు మధ్య నిబిడీకృతమై ఉన్నది కావున లోకాలోకమైనది. మేరువు మొదలుకొని మనసాంతం వరకు నేల అంతా  సువర్ణమయమై అద్దములా ఉంటుంది కనుక మొక్క మొలవదు జీవికి వాస యోగ్యముకాదు. అంతా నిర్మానుష్యమే. ప్రాంత విస్తీర్ణము పన్నెండు కోట్ల యాభైలక్షల యోజనములు. పురాణోక్తి ప్రకారము మహావిష్ణువు అష్ట సిద్ధులతో అష్ట దిక్కులను శంఖ, చక్ర, గదా పాణియై సర్వలోకములకు క్షేమము కోరి సదా పరిరక్షిస్తూ ఉండటమే విశేషము. అందువలననే విష్ణువుని సృష్టి రక్షకుడిగా అభివర్ణించడమైనది. కల్పాంతమువరకు కార్యక్రమము సర్వదా జరిగే ప్రక్రియ. పర్వతానికి ఆవలితీరమున శుద్ధ ఆకాశముతప్ప మరేమీ ఉండదు.

క్రీ. ఫూ. 30 బి.స్.. నుండి 18 బి.స్.. వరకు మెసపటోమియన్ నాగరీకులు నివశించిరి అనునది చారిత్రాత్మిక ఆధారములతో నిరూపణమైనది. క్రీ. పూ. 15000 సంవత్సరములకు పూర్వమే ఆసియా, అమెరికా ద్వీపములను కలుపుతూ "బేరింగ్ ల్యాండ్ వంతెన" నిర్మించబడినది.




ముఖ్యోద్దేశ్యము రెండు ద్వీపముల మధ్య విశిష్ట జంతుజాలములను, వివిధ మొక్కలను మరియు మనుష్యుల రవాణా సదుపాయములను మెరుగు పరచుటకు, స్నేహ సంభంధ భాంధవ్యములను ద్విగ్గుణీత పరచుటకు అనువుగా ఏర్పరచబడినది. నార్వే దేశస్థుడైన "లీఫ్ ఇరిక్సొన్" సుమారు 970 నుంచి 1020 మధ్య కాలములో ద్వీపమును తలపెను. తరువాత కాలములో కొలంబస్ అను ఇటలీ నావికుడు క్రీ.. 10-10-1492 ద్వీపమును తలపి భారత భూభాగమును చేరెనని తలచి అచట వశించు జనులను భారతీయులుగా భావించి వారికి "రెడ్ ఇండియన్స్" అను పేరు స్థిర పరచెను. క్రీ. . 10-08-1519 తేదీనఫెర్డినాండ్ మేగల్లేన్అను స్పైన్ దేశనావికుడు ప్రపంచమును చుట్టి వచ్చిన మహనీయుడు. భూమి నిజముగా గుండ్రముగా ఉన్నదని ఉత్తర అమెరికా ఆవలతీరము అంతా జలమయమేనని, మరి భూభాగము శూన్యమేనని నిరూపించడము జరిగినది.

ఇచట వశించు ప్రజలు దీర్ఘ ఆయువు కలవారు, ధవళకాంతితో మెరిసే శరీరచ్చాయ వీరి స్వంతము, ఆజానుబాహులు, సుసంపన్నులు. నేటి కాలగణనము ప్రకారము ద్వీప విస్తీర్ణము 24709000 స్క్వేర్ కి. మీ. (163445 చదరపుయోజనములు) గా విపులీకరించబడినది. క్రీ. . 1507 లో "మార్టీన్ ఓల్డ్సీ ముల్లర్" తయారు చేసిన మొదట ప్రపంచ పటములో అమెరికా ద్వీపములను స్పానిష్ భాషలో "నోవూస్ ముండస్" గా అభివర్ణించ బడినవి. వీని అర్ధము "నూతన ప్రపంచములు" అను పేర తరువాత కాలములో సర్వజన ఆమోదయోగ్యమైనవి. వ్యాస విరచితమైన "భవిష్యపురాణము" లో విశ్వవిఖ్యాతి చెందిన ఆంగ్లభాషను "గురుండికా" అనుపేరుతో వ్యవహరించడ మైనది (పితృ = ఫాధర్; మాతృ = మదర్; భాతృ = బ్రదర్). ఆదిగాగల పద ఉచ్చరణలో సంస్కృత శభ్ధములు సుశోభితమవడము గమనార్హము. (ఆరాధ్యదైవంపరమేశ్వరుడు; సముద్రంజలార్ణవం (పసిఫిక్ మహ అసముద్రము); ఫర్వతంమానసోత్తరం).



కులాలు వేరైనా, ప్రాంతములు వేరైనా, సంస్కృతీ సంప్రదాయములు వేరైనా, మతములు వేరైనా, భోజన రీతులు వేరైనా, భాషలు వేరైనా విశ్వమంతా ఒక్కటే అనిపించి, పంచభూతములను ఇలపై పరిభ్రమింపచేసి, ప్రకృతి ఆరాధకులను చేసి యుగయుగాలు నుంచి నేటివరకు శాంతియుత వసుధైక కుటుంబ ఆలంబనమునకు ఆధ్యాత్మిక, విజ్ఞాన సోపాన ఆరోహణలకి "భారతదేశమే" తొలి మెట్టుగా భాసిల్లుతున్నది అనునది నా ఉద్దేశము.

No comments:

Post a Comment